ఛత్రపతి రీమేక్ పై ప్రభాస్ రియాక్షన్.. బెల్లంకొండ శ్రీనివాస్ మరో సాహసం

  • IndiaGlitz, [Tuesday,June 29 2021]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ఛత్రపతి. 2005లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు.

మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. జూలై 11 నుంచి హైదరాబాద్ లో ఈ చిత్ర షూట్ ప్రారంభం కానుంది. ఛత్రపతి హిందీ రీమేక్ గురించి ప్రభాస్ రియాక్ట్ అయినట్లు బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. లాక్ డౌన్ కి ముందు ప్రభాస్ ముంబైలో ఆదిపురుష్ సెట్ లో ఉండగా కలిసినట్లు శ్రీనివాస్ తెలిపాడు.

ఇదీ చదవండి: ఒకేసారి 10మంది మల్ల యోధులతో పవన్.. 'వీరమల్లు' ఫైట్ లీక్

ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ఆయనకు వివరించగా.. అది చాలా మంచి నిర్ణయం అని ప్రభాస్ తనతో చెప్పినట్లు శ్రీనివాస్ తెలిపాడు. వలస వచ్చిన సముద్రపు కూలీ డాన్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా ఈ చిత్రం కోసం బెల్లంకొండ శ్రీనివాస్ మరో సాహసం కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఛత్రపతి రీమేక్ కోసం హిందీలో శ్రీనివాస్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్నాడట. అందుకోసం శ్రీనివాస్ హిందీ క్లాసులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఛత్రపతి హిందీ రీమేక్ ని సక్సెస్ ఫుల్ గా మలిచేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని శ్రీనివాస్ వినియోగించుకుంటున్నాడు.

More News

ఒకేసారి 10మంది మల్ల యోధులతో పవన్.. 'వీరమల్లు' ఫైట్ లీక్

క్రమంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

మెగాస్టార్ 153: మంచి కిక్కిచ్చే అప్డేట్.. మోత మోగడం ఖాయం

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.

ఆలోచింపజేసేలా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' ఫస్ట్ లుక్!

శర్వానంద్ 30వ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలయింది.

హైదరాబాద్ మరో అద్భుతం.. ఇక నేరగాళ్ల పని అంతే, అతి త్వరలో..

హైదరాబాద్ లో మరో అద్భుత ఆవిష్కరణకు సమయం ఆసన్నమైంది.

వందల కోట్లల్లో ఈ చిత్రాల పెట్టుబడి.. థర్డ్ వేవ్ వచ్చేలోపు వచ్చేస్తాయా..

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా సినిమా రంగ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చిన్న చిత్రాలు ఓటిటి వేదికల్ని వెతుక్కుంటున్నాయి.