పెళ్లి గురించి పెదనాన్నకి ప్రామీస్ చేసిన ప్రభాస్...

  • IndiaGlitz, [Wednesday,January 20 2016]
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం బాహుబ‌లి 2. ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి 2 ప్ర‌స్తుతం కేర‌ళ‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇదిలా ఉంటే...ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాకి ముందు బాహుబ‌లి రిలీజ్ త‌ర్వాత పెళ్లి చేసుకుంటాను అన్నారు. బాహుబ‌లి రిలీజ్ అయ్యింది కానీ ప్ర‌భాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు.
ఇదే విష‌యం గురించి...ప్ర‌భాస్ పెద నాన్న క్రిష్ణంరాజు ని అడిగితే...ఈ సంక్రాంతి సంద‌ర్భంగా ప్ర‌భాస్ పెళ్లి గురించి నాకు ఓ ప్రామీస్ చేసాడు. అదేమిటంటే...ఈ సంవ‌త్స‌రంలో ఖ‌చ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఇక అమ్మాయిని చూడ‌డం ఒక‌టే మిగిలింది అన్నారు. అంతా బాగానే ఉంది ఇంత‌కీ ప్రేమ వివాహామా..? పెద్ద‌లు కుద‌ర్చిన వివాహామా అంటే ..ప్ర‌భాస్ మ‌న‌సుకి న‌చ్చిన అమ్మాయి అంటూ తెలివిగా స‌మాధానం ఇచ్చారు రెబ‌ల్ స్టార్. మ‌రి...ప్ర‌భాస్ ఎలాంటి పెళ్లి చేసుకుంటాడ‌నేది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

నాగ్ ను అభినందించిన ఊపిరి టీమ్..

కింగ్ నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా.

షూటింగ్ పూర్తి కావచ్చిన 'నిర్మల కాన్వెంట్'

కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'నిర్మల కాన్వెంట్'.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'తుంటరి'

శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెం.2లో నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'తుంటరి'.బాణం, సోలో,సారొచ్చారు,

అసిన్ పెళ్లి అయ్యింది..

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ అసిన్. గజిని, శివమణి, లక్ష్మి నరసింహా తదితర చిత్రాల్లో నటించిన అసిన్ ఈరోజు పెళ్లి చేసుకుంది.

న్యూలుక్ తో సర్ ఫ్రైజ్ చేస్తున్న చిరు..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి..డైరెక్టర్ వినాయక్, నిర్మాత చరణ్, కత్తి రీమేక్... అంటూ.. గత కొన్నిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల డైరెక్టర్ వి.వి.వినాయక్ తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు.