భారీ చేజ్‌లో ప్ర‌భాస్‌...

  • IndiaGlitz, [Saturday,October 20 2018]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'సాహో'. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇటీవ‌ల దుబాయ్‌లో 90 కోట్ల ఖ‌ర్చుతో భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఇప్పుడు రొమేనియాలో హీరో, విల‌న్ మ‌ధ్య భారీ చేజింగ్ సీన్‌ను తెరకెక్కించబోతున్నార‌ట‌. ఈ సీన్‌లో ప్ర‌భాస్‌తో పాటు నీల్ నితిన్ ముఖేష్ న‌టించ‌బోతున్నార‌ట‌.

ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మందిరాబేడి, జాకీష్రాఫ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సినిమా విడుద‌ల కాబోతుంది. శంక‌ర్ ఎహ్‌సాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.

More News

మీటూ పై ర‌జ‌నీ స్పంద‌న‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మీ టూ ఉద్య‌మంపై త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. నిన్న‌టితో పేట్ట చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఆయ‌న నేడు చెన్నై చేరుకున్నారు.

నాగ్, ధ‌నుష్ టైటిల్‌

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు కింగ్ నాగార్జున ఇప్పుడు త‌మిళంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాగార్జున‌తో క‌లిసి నటిస్తూనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు ధ‌నుష్‌.

ప్రేక్ష‌కులను ఆలోచింపజేసే చిత్రం 'రంగు' - హీరో త‌నీష్

న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో  యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు,

నవంబర్ 16న 'టాక్సీవాలా' రిలీజ్

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా.

నిర్మాత‌ కొనేరు స‌త్య‌నారాయ‌ణ‌...రెండు సినిమాలు 

కె.ఎల్‌.యూనివ‌ర్సిటీ అధినేత కొనేరు స‌త్య‌నారాయ‌ణ పుట్టిన‌రోజు నేడు (అక్టోబ‌ర్ 20). ఈ సంద‌ర్భంగా ఆయ‌న నిర్మాణంలో రూపొందుతోన్న రెండు సినిమాల వివ‌రాల‌ను ఆయ‌న ప్ర‌క‌టించారు.