ప్ర‌భాస్‌కు త‌ప్పేలా లేదు!!

  • IndiaGlitz, [Sunday,August 09 2020]

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌క‌పోయినా ప్ర‌భుత్వాలు కొన్ని విధి విధానాల‌ను ఏర్పాటు చేసి ఆ మేర‌కు షూటింగ్స్ చేసుకోవ‌చ్చున‌ని తెలియ‌జేశారు. అయితే ఈ నియ‌మాలు పెద్ద బ‌డ్జెట్ చిత్రాల‌కు పెద్ద అడ్డంకిగా మారాయి. ఎందుకంటే ప్ర‌భుత్వ నియ‌మాల ప్ర‌కారం లొకేష‌న్‌లో 40 నుండి 50 మంది మాత్ర‌మే ఉండాలి. కానీ.,.. పెద్ద సినిమాల‌కు క‌నీసం 200 నుండి 300 మంది అవ‌స‌రం అవుతారు. స‌రే! చూద్దాం త‌క్కువ మందితో షూటింగ్ ఎలా చేయ‌వ‌చ్చునో అని రాజ‌మౌళి ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఆయ‌న‌కు వ‌చ్చిన అవుట్‌పుట్ శాటిస్పాక్ష‌న్‌గా అనిపించ‌లేదు. దీంతో రాజ‌మౌళి త‌న ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ షూటింగ్‌ను మ‌రికొన్ని రోజులు వెనక్కి తీసుకెళ్లారు.

ఇది కాకుండా ఇంకా చాలా పెద్ద చిత్రాలు సైలెంట్‌గా అస‌లేం జ‌ర‌గుతుందోన‌ని వేచి చూస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో ప్ర‌భాస్ త‌న 20వ చిత్రం ‘రాధేశ్యామ్’ కోసం విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారట. అదేంటి ఇక్క‌డే సెట్ వేసి తీస్తార‌ని వార్త‌లు వినిపించాయిగా అనే అనుమానం రాక‌మాన‌దు. అయితే.. ప్ర‌భాస్ అండ్ టీమ్ ప్ర‌భుత్వం విధించిన నియ‌మ నిబంధ‌న‌ల్లో షూటింగ్స్ ఇక్క‌డైతే షూటింగ్ చేయ‌లేమ‌ని భావిస్తున్నార‌ట‌. అదే విదేశాల్లో అయితే ఇలాంటి నిబంధ‌న‌లు ఏమీ లేవు. అక్క‌డ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రిస్తే వారు ముందు ప్లాన్ చేసుకున్న అవుట్ పుట్ వ‌స్తుంది. ఒక‌వేళ అక్క‌డి లొకేష‌న్స్‌ను ఇక్క‌డ సెట్స్‌లా వేసి తీస్తే మ‌ళ్లీ గ్రాపిక్స్ ఎక్కువ ఖ‌ర్చు అవుతుంది. ఇదంతా నిర్మాతకు భార‌మే కాబ‌ట్టి.. ప్ర‌భాస్ అండ్ టీమ్ యూర‌ప్ వెళితేనే బెట‌ర్ అని భావిస్తున్నార‌ని టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More News

నా గది గోడలనిండా పవన్ ఫోటోలుండేవి: మాధవీలత

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాధవీలత వీరాభిమాని. ఇంతటి అభిమానిగా మారడానికి గల కారణాలను, అలాగే పవన్ ప్రస్తుతం బీజేపీతో కలిసి పని చేస్తున్నారు.

చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడంటూ ట్విట్టర్‌ని షేక్ చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. నాటి జనరేషన్ నుంచి నేటి జనరేషన్ వరకూ ఆయన్ను విపరీతంగా అభిమానిస్తారు.

రానా పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా రామ్ చరణ్ దంపతులు..

ప్రముఖ సినీ నటుడు రానా వివాహం శనివారం రాత్రి 8:30 గంటలకు మిహీక బజాజ్‌తో జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో

మూడు రాజధానుల శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్..

మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16 నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మహేష్ బర్త్ డే స్పెషల్‌గా ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్..

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మహేష్‌కు విషెస్ చెబుతూ మైత్రి మూవీ మేకర్స్ ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.