ప్రభాస్ తో సుజిత్ మూవీ ఉందా..

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్..బాహుబ‌లి బిగినింగ్ నుంచి బాహుబ‌లి 2 గ్యాప్ లో ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజిత్ తో ఓ మూవీ చేయాల‌నుకున్నారు. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించ‌డానికి ప్లాన్ చేసారు. క‌థ రెడీగానే ఉంది. అయితే బాహుబ‌లి బిగినింగ్ నుంచి బాహుబ‌లి 2 మ‌ధ్య‌లో గ్యాప్ త‌క్కువగా ఉండ‌డంతో ఈ సినిమా ప్రారంభించ‌లేదు. దీంతో అస‌లు డైరెక్ట‌ర్ సుజిత్ తో ప్ర‌భాస్ సినిమా ఉంటుందా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం బాహుబ‌లి 2 ను డిసెంబ‌ర్ లో ప్రారంభించ‌నున్నారు. అందుచేత వ‌చ్చే సంవ‌త్స‌రం జులైలో సుజిత్ తో సినిమా చేయ‌డానికి ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. సినిమా ప్రారంభించ‌డానికి చాలా టైం ఉండ‌డంతో స్ర్కిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నాడ‌ట సుజిత్. మ‌రి...బాహుబలితో జాతీయ స్ధాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్ర‌భాస్ ని సుజిత్ ఎలా చూపిస్తాడో..?

More News

శంకరాభరణం వాయిదాకి కారణం అదే..

నిఖిల్,నందిత జంటగా నటిస్తున్న తాజా చిత్రం శంకరాభరణం.ఉదయ్ నందనవనమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

సిటీకి చేరుకున్న సర్ధార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నారు.పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ 'విశాల్ 'మదగజరాజా'

ఇటీవల జరిగిన ‘తమిళ నడిగర్ సంఘం’ఎన్నికల్లో హేమాహేమీలను ఢీకొని ఘన విజయం సాధించి..‘వార్తల్లో వ్యక్తి’గా నిలిచిన సంచలన కథానాయకుడు విశాల్ తాజా తమిళ చిత్రం ‘మద గజ రాజా’

శ్రీను వైట్ల పై కోన కేసు

డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల పై భార్య రూపా వైట్ల కేసు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ కేసు ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు జ‌రుగుతుంది.

సోషల్ మీడియా లో చేరిన లారెన్స్

కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి డ్యాన్స్ మాస్టర్ గా, దర్శకుడిగా, హీరోగా ఎదిగిన రాఘవేంద్ర లారెన్స్ ప్రస్తుతం దర్శకుడుగా చాలా బిజీగా మారిపోయాడు