బ్యాంకాక్ లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ విగ్రహం

  • IndiaGlitz, [Saturday,October 01 2016]

వచ్చే 2017 సంవత్సరంలో బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియం బాహుబలిని ఆవిష్కరించబోతుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూల్లు సాధించిన బాహుబలి చిత్రంలో నటించిన ప్రఖ్యాత భారతీయ నటుడు ప్రభాస్ మైనపు ప్రతిమను ఈ మ్యూజియంలో ప్రతిష్టించబోతున్నారు. ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదంచిన ఈ మైనపు ప్రతిమ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మార్చ్ 2017 నుండి ప్రత్యేకమైన ఆకర్షణ కాబోతుంది. 2016 ఏప్రిల్‍లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మైనపు విగ్రహ ప్రతిష్ఠ తర్వాత, ఈ గౌరవం దక్కించుకున్న మూడవ భారతీయునిగా ప్రభాస్ నిలవబోతున్నారు.

ధాయిల్యాండ్‍లోని బ్యాంకాక్ క్లస్టర్ ఫర్ మెర్లిన్ ఎంటర్‍టైన్మెంట్స్(Bangkon Cluster for Merlin Entertainments) ప్రధాన కార్యదర్శి మరియు మేడమ్ టుస్సాడ్ మ్యూజియం ప్రధాన కార్యదర్శి అయిన నోప్పడోన్ ప్రాపింపన్ట్ (Noppadon Prapimpunt)మాట్లాడుతూ "ప్రభాస్ ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి" అన్నారు. ఆయన వెండితెరమీద తన ధీరోదాత్తమైన నటనతో మాత్రమే కాదు, ప్రముఖ నిర్మాత అయిన తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, ప్రముఖ నటులు, రాజకీయనాయకులు అయిన పెదనాన్న కృష్ణంరాజు గార్ల వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా కూడా ప్రఖ్యాతిగాంచారు. భారతీయ చిత్రాలు సాధించిన వసూల్లపరంగా ప్రపంచంలో మూడవస్ధానంలో, భారతదేశంలో మొదటి స్ధానంలో నిల్చిన "బాహుబలి: ది బిగినింగ్ (2015)" లో నటించిన ప్రభాస్, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో అత్యధికులు వెతికిన వ్యక్తుల్లో ఒకరు అయ్యారు. ఆయన ప్రతిమను కోరుతూ మాకు ప్రపంచం నలుమూలల్లోని అభిమానుల నుండి అభ్యర్ధనలు వెల్లువెత్తాయి. మేడమ్ టుస్సాడ్ మ్యూజియం ఆయన మైనపు విగ్రహాన్ని భారతీయుల్ని అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులైన మహాత్మా గాంధీ, నరేంద్ర మోడీల సరసన చేర్చడాన్ని ఘనంగా స్వాగతస్తుంది.

ప్రభాస్ ప్రతిమను యదాతధంగా రూపొందించడానికి మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నుండి వచ్చిన కళాకారులు ఆయనను హైద్రాబాద్లో కలిసి 350 ఛాయాచిత్రాలను, ఆయన శారీరక కొలతలను తీసుకున్నారు. ఆయన బాహుబలి చిత్రంలోని వస్త్రధారణతో ఉన్న ఆహార్యాన్ని పోలిన ప్రతిమను సృష్టించి అదే పేరుతోమేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రతిష్టించబోతున్నారు. ఈ చిత్రంలో నటించిన తర్వాత ప్రభాస్ జాతీయ స్ధాయి నటుడిగా ఎదగడంతో పాటు, అనేక మంది అభిమానుల్ని, ప్రశంసల్ని సంపాదించారు.

ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ " మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో స్ధానం దక్కడం చాలా ఆనందంగా ఉంది. అభిమానలవల్లే ఇది సాధ్యమయ్యింది. వాళ్లు నాపై చూపించే ప్రేమాభిమానాలకు కృతజ్ఞున్ని. అలానే బాహుబలి లాంటి అద్భతమైన చిత్రంలో నటించే అవకాశాన్నచ్చిన మా గురువు రాజమౌలిగారికి కూడా ప్రత్యేకంగా ధ్యన్యవాదాలు చెప్పుకుంటున్నాను" అన్నారు

2017 మార్చ్ నుండి మ్యజియంలోని "మూవీ రూమ్లో" అభిమానులు, స్పైడర్ మ్యాన్, వోల్వెరిన్, జేమ్స్ బాండ్, కేప్టెన్ అమెరికా తరహాలోనే తమ అభిమాన "బాహబలి" పక్కనే నిలబడి సెల్ఫీలు తీసుకోవచ్చు.మేడమ్ టుస్సాడ్ బ్యాంకాక్ మ్యూజియం, సియమ్ డిస్కవరీ (Siam Discovery) భవనంలోని నాలుగో అంతస్ధులో ఉంటుంది.

More News

ప్రత్యేక పూజలు పై క్లారిటి ఇచ్చిన చైతు..!

ఇటీవల నాగార్జున సమక్షంలో చైతన్య,సమంత కలిసి పూజ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.

మహేష్ కాస్ట్ లీ ఫైట్.....

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

త్వరలో పరుగెడతా అంటున్నవరుణ్ తేజ్..!

మెగా హీరో వరుణ్ తేజ్ మిష్టర్ సినిమాలో నటిస్తున్నారు.ఊటీలో షూటింగ్ జరుగుతుండగా వరుణ్ తేజ్ కి గాయాలు అయిన విషయం తెలిసిందే.

బాలయ్య మూవీని రిలీజ్ చేస్తున్న నితిన్..!

బాలయ్య మూవీని నితిన్ రిలీజ్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా..?

బాహుబ‌లి యానిమేష‌న్ టీజ‌ర్ రిలీజ్..!

బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా బాహుబ‌లి 2 రూపొందుతుంది. రెండు పాట‌లు, కొన్ని సీన్స్ మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది.