ఆకాశ్ పూరి బిగ్ స్టార్‌గా ఎద‌గాలి - ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం 'మెహబూబా'.

1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ అధినేత దిల్‌ రాజు మే 11న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా పూరి జ‌గ‌న్నాథ్‌కి, ఆకాశ్‌కి ఎంటైర్ యూనిట్‌కి యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల సంద‌ర్భంగా శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు.

ప్ర‌భాస్ మాట్లాడుతూ మెహ‌బూబా ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నాకు పూరిగారు చాలా క్లోజ్‌. ఆయ‌న యుఎస్‌పి అంతా హీరో క్యారెక్ట‌రైజేష‌న్ మీద‌నే ఉంటుంది. కానీ ఈ సినిమాలో బ్యూటీఫుల్ విజువ‌ల్స్ క‌నిపిస్తున్నాయి. వార్ బ్యాక్‌డ్రాప్‌, యుద్ధ విమానాలు అన్నీ క‌న‌ప‌డుతున్నాయి. పూరిగారికి కూడా ఫోన్ చేసి మీరేంటి ఈసారి విజువ‌ల్స్ మీద కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేసిన‌ట్టున్నారు అని అన్నాను.

ఆకాశ్ పూరిని సినిమాలో చూసి షాక‌య్యాను. నా బుజ్జిగాడు సినిమాలో నా యంగ్ రోల్‌ను ఆకాశ్ చేశాడు. ఈరోజు హీరోగా మ‌న ముందుకు వ‌స్తున్నాడు. త‌ను మా కుంటుంబంలోని వ్య‌క్తి. త‌ను బిగ్ స్టార్‌గా ఎద‌గాలి.  త‌న పెర్ఫామెన్స్‌తో ఇంప్రెస్ అయ్యాను. త‌న వాయిస్‌, డైలాగ్ డెలివ‌రీ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. కీప్ ఇట్ అప్ ఆకాశ్‌. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. పూరి డార్లింగ్‌, ఆకాశ్ స‌హా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు. 

More News

పూరీ బాట‌లో వంశీ కూడా వెళ‌తారా?

పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, శ్రీనువైట్ల, సుకుమార్ ఈ నలుగురు దర్శకులకి సంబంధించి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది.

కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో చిరు?

మిర్చి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన ర‌చ‌యిత కొర‌టాల శివ‌.. తొలి ప్ర‌యత్నంలోనే విజ‌యం అందుకున్నారు.

రెండో రేసు గుర్రం వ‌స్తోందా?

రేసు గుర్రం.. 2014 వేస‌వికి విడుద‌లై ఆ ఏడాదిలోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన మూవీ ఇది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ప‌ద‌హారేళ్ళు పూర్తి చేసుకున్న అల్ల‌రి న‌రేశ్‌

హాస్య ప్ర‌ధాన చిత్రాల‌కు చిరునామాలా నిలిచిన ఈ త‌రం హాస్య క‌థానాయ‌కుడు అల్ల‌రి న‌రేశ్‌. ఒక టైమ్‌లో మినిమ‌మ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న న‌రేశ్‌.. వ‌రుస సినిమాలు చేస్తూ వార్తల్లో నిలిచారు.

సుమంత్ అశ్విన్ హీరోగా ప్రొడక్షన్ నెం.3 'ప్రేమ కథా చిత్రం 2' ప్రారంభం

ప్రేమ కథా చిత్రం, జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ తో