ప్రేమ పెళ్లికి సిద్ధమవుతున్న ప్రభుదేవా!

  • IndiaGlitz, [Friday,November 13 2020]

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా మరోసారి ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివాహమై ప్రభుదేవాకు పిల్లలున్నారు. అయితే స్టార్ హరోయిన్ నయనతారతో ప్రేమలో పడి భార్య రామలతకు విడాకులు ఇచ్చేశారు. ఆ తరువాత నయన్‌తో పెళ్లి పీటల వరకూ వెళ్లిన ప్రేమ కారణాలు తెలియవు కానీ ఫుల్ స్టాప్ పడిపోయింది. దీంతో అప్పటి నుంచి ప్రభుదేవా తన కుటుంబానికి దూరమై ఒంటరిగానే ఉంటూ వస్తున్నారు.

కాగా.. గత కొంత కాలంగా ప్రభుదేవా తన బంధువుల అమ్మాయితో ప్రేమతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా ప్రభుదేవాను ఇష్టపడుతోందట. దీంతో వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వార్తలపై ప్రభుదేవా ఇప్పటివరకు స్పందించలేదు. ప్రభుదేవా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా 'రాధే' సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

More News

క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సింగిల్ హ్యాండ్‌తో చుక్కలు చూపించారు.. కానీ సీఎం సీట్ జస్ట్ మిస్..

ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. అయితే ఆర్‌జేడీ అధినేత, మహాకూటమి సారథి తేజస్వి యాదవ్‌ ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇచ్చారు.

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అన్న విషయం ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అయితే అభిమానులకు నేడు చిరు గుడ్ న్యూస్ చెప్పారు. నిజానికి ఆయనకు కరోనా సోకలేదని..

జీహెచ్ఎంసీ ఎన్నికలకు డేట్ ఫిక్స్!

జీహెచ్ఎంసీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ వీలైనంత త్వరగా నిర్వహించాలని భావిస్తోంది. మరో మూడు రోజుల్లో అంటే దీపావళి మరుసటి రోజే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.

క్రాకర్స్‌పై నిషేధం... కేవలం రెండు రోజుల ముందా?

దీపావళి పండుగపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.