Matarani Mounamidi: ప్రదీప్ మాచిరాజు చేతుల మీదుగా "మాటరాని మౌనమిది" చిత్రం నుంచి 'ఈ రోజేదో' లిరికల్ సాంగ్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,July 20 2022]

రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా మాటరాని మౌనమిది. మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న మాటరాని మౌనమిది సినిమా
చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఈ రోజేదో లిరికల్ పాటను యువ హీరో, యాంకర్ ప్రదీప్ మాచిరాజు విడుదల చేశారు.

ఈ సందర్భంగా..

ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ... నేను కూడా ఈ టీమ్ లో భాగమే అనుకుంటాను. ఈ పాట విడుదల చేయడం సంతోషంగా ఉంది. మంచి ట్యూన్ తో పాటు దర్శకుడు సుకు పూర్వాజ్ కొత్త కాన్సెప్ట్ తో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ పాటతో పాటు త్వరలో విడుదల కాబోతున్న సినిమా కూడా సక్సెస్ కావాలి. అన్నారు.

ఈ పాటకు అషీర్ లూక్ స్వరాలు అందించగా, డాక్టర్ వాసుదేవ్ సాహిత్యాన్ని అందించారు. ఆషీక్ అలీ, సోనీ కొమండూరి పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే...ఈ రోజేదో కొత్తగ ఉంది. ప్రేమో ఏమో మొదలయ్యింది. ఏ మాయ చేశావో, ఏ మంత్రం వేశావో, గాల్లో తేలుతున్నానే ఇలా. నింగిన దారం తెగిన గాలిపటంలా. అంటూ ప్రేమికుడి లవ్ ఫీలింగ్స్ చెబుతూ సాగుతుందీ పాట.

న‌టీ న‌టులు - మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు.

సాంకేతిక వ‌ర్గం - , సినిమాటోగ్ర‌ఫీ చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, పిఆర్ఒ జియ‌స్ కె మీడియా, నిర్మాత ః రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్, ద‌ర్శ‌కుడు ః సుకు పూర్వాజ్.

More News

CPI Narayana : ‘‘ గడ్డి తింటున్నట్లున్నాడు.. కాస్త అన్నం పెట్టండి, మనిషవుతాడు ’’ : సీపీఐ నారాయణకు నాగబాబు కౌంటర్

మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

CPI Narayana: మెగా ఫ్యాన్స్ దెబ్బ.. చిరుపై వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా : సీపీఐ నారాయణ

మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు సీపీఐ నారాయణ. బుధవారం ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన ..

Pawan kalyan : కౌలు రైతు భరోసా యాత్రకు రూ.5 లక్షల విరాళం.. తదేకం ఫౌండేషన్‌కు పవన్ ప్రశంసలు

తదేకం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Parampara 2: "పరంపర 2" లో గోపీ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది - నవీన్ చంద్ర

హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్...ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర.

Janasena : జనవాణికి అద్భుత స్పందన.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: నాదెండ్ల మనోహర్

సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ “జనవాణి -జనసేన భరోసా” కార్యక్రమం చేపట్టిందన్నారు