పవన్ కల్యాణ్ ఒక ఊసరవెల్లి: ప్రకాష్ రాజ్

  • IndiaGlitz, [Saturday,November 28 2020]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఆయనను ఊసరవెల్లితో పోలిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. మీకంటూ ఒక సొంత పార్టీ పెట్టుకుని మరో పార్టీ నాయకుడిని సపోర్ట్ చేయడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గత ఎన్నికల్లో ఆంధ్రాలో మీ పార్టీ ఓటు షేర్ ఏంటి? బీజేపీ ఓటు షేర్ ఎంటని నిలదీశారు. ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కో విధంగా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఊసరవెల్లిలా మారిపోయారని పవన్ విమర్శించారు.

ఓ ప్రముఖ మీడియా ఛానల్‌తో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘పవన్ కల్యాణ్‌కు ఏమైందో నాకు అర్థం కావడం లేదు. నేను పవన్ కల్యాణ్ తీరుతో నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను. నీకు నువ్వే ఒక లీడర్‌వి. జనసేన అనే పార్టీ ఉంది మీకు. మీరు ఇంకో నాయకుడి వైపు వేలు చూపిస్తుండటమేంటి? ఆంధ్రాలో గత ఎన్నికల్లో మీ ఓటు షేర్ ఏంటి? బీజేపీ ఓటు షేర్ ఏంటి? మీరెందుకు ఆయన భుజాన ఎక్కారు? మీరే 2014లో అద్భుతం వాళ్లు.. ఇంద్రుడు, చంద్రుడు అంటూ వాళ్లను సపోర్ట్ చేశారు. గత ఎన్నికల్లో లేదు వాళ్లు ద్రోహం చేశారని రివర్స్ వచ్చారు. మళ్లీ ఇప్పుడు మీకు నాయకుడిగా కనిపిస్తున్నారు. అంటే ఇలా పదే పదే మారుతున్నారంటే ఊసరవెల్లి అయి ఉండాలి కదా. దేశ ప్రయోజనాల కోసమే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటే నమ్మొద్దు. అది చేస్తున్నారా వీళ్లు ఈ ఎలక్షన్స్‌లో వచ్చి? వీళ్లు మాట్లాడుతున్న మాటలేంటి?’’ అంటూ ప్రకాష్‌రాజ్ మండిపడ్డారు.

More News

పీఎం పర్యటనకు సీఎం కేసీఆర్‌కు అనుమతి లేదట...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు.

రేస్ టు ఫినాలే స్టార్ట్..

‘ఓ బేబీ’ టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. మోనాల్ యోగాసనం వేసింది. నేనూ చేస్తా.. నాకేమైనా తక్కువా అని అవినాష్ వచ్చాడు.

ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయింది: జేపీ నడ్డా

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఎన్టీఆర్ స‌ర‌స‌న మ‌హేశ్ హీరోయిన్‌?

టాలీవుడ్‌లో ఎవ‌రైనా స్టార్ హీరో సినిమా మొద‌లైందంటే.. ఆ హీరో స‌ర‌స‌న న‌టించ‌బోయే జోడీ ఎవ‌రా అనే ఆస‌క్తి అంద‌రిలోనూ క్రియేట్ అవుతుంది.