close
Choose your channels

ఆమె బ‌యోపిక్‌లో ప్ర‌కాష్ రాజ్‌

Thursday, October 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆమె బ‌యోపిక్‌లో ప్ర‌కాష్ రాజ్‌

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. డిఫ‌రెంట్ పాత్ర‌లు చేయ‌డానికే ఆయ‌న ఆస‌క్తి చూపుతుంటారు. ఇప్పుడు ఆయ‌న అలాంటి పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్తే.. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ `త‌లైవి` రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొంద‌బోయే ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నున్న సంగ‌తి కూడా తెలిసిందే. న‌వంబ‌ర్ నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఒక‌వైపు.. వ‌ర్క్ షాప్ మ‌రో వైపు జ‌రుగుతుంది. జ‌య‌ల‌లిత పాత్ర‌లో న‌టించ‌డానికి కంగ‌నా ర‌నౌత్ చాలా సీరియ‌స్‌గా ప్రిపేర్ అవుతుంది. భ‌ర‌త నాట్యం కూడా నేర్చుకుంటుంది. ప్రాస్థ‌టిక్ మేక‌ప్ వేసుకోనుంది.

ఇక ఇందులో నటీన‌టుల విష‌యానికి వ‌స్తే.. కంగ‌నా జ‌య‌ల‌లిత పాత్ర‌ను పోషిస్తుంటే.. న‌టుడు అర‌వింద‌స్వామి త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎం.జి.రామ‌చంద్ర‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు.

కాగా.. ఇప్పుడు సినిమాలో మ‌రో పాత్ర కూడా ఖ‌రారైంది. జ‌య‌ల‌లిత ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టించ‌బోతున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టించ‌డం కొత్తేమీ కాదు.. ఈ పాత్ర‌ను ఆయ‌న చేస్తే.. ఈ పాత్ర‌ను ఆయ‌న రెండోసారి చేసిన‌ట్లు అవుతుంది. ఇది వ‌ర‌కు ఇద్ద‌రు చిత్రంలోనూ క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించి మెప్పించారు. ఇప్పుడు మ‌రోసారి చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.