సెప్టెంబర్ లో ప్రకాష్ రాజ్ చిత్రం...

  • IndiaGlitz, [Saturday,July 30 2016]

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ నటుడుగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా కూడా సినిమాలు చేస్తుండే సంగ‌తి తెలిసిందే. అలాంటి ప్రకాష్ రాజ్ ద‌ర్శ‌క నిర్మాణంలో ఇప్పుడు మనవూరి రామాయణం' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ప్ర‌కాష్ రాజ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఫ‌స్ట్ కాపీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంద‌ట‌, సెన్సార్ పూర్తి చేసుకోవ‌డానికి సినిమా సిద్ధ‌మైంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ప్ర‌కాష్ రాజ్ ఈ సినిమాను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

ఈ విష‌యాన్ని ప్ర‌కాష్ రాజ్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు. తెలుగులో మ‌న‌వూరి రామాయ‌ణం, క‌న్న‌డ‌లో ఇదోల్లె రామాయ‌ణ అనే టైటిల్‌తో సినిమా విడుద‌ల అవుతుంది. సెన్సార్ కూడా పూర్త‌యిన త‌ర్వాతే ప్ర‌కాష్ రాజ్ విడుద‌ల తేదిని అనౌన్స్ చేసి దానికి త‌గిన విధంగా ప్ర‌మోష‌న్స్ ను ప్లాన్ చేస్తాడ‌ట‌. అయితే ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు.

More News

అమీర్ పేటలో మహేష్..

సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం నిన్న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన విషయం తెలసిందే.

100 రోజులు పూర్తి చేసుకున్న 'సరైనోడు'

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గీతాఆర్ట్స్ బ్యానర్పై రూపొందిన చిత్రం సరైనోడు చిత్రం 100రోజలును పూర్తి చేసుకుంది.

టైటిల్ కన్ ఫర్మ్ చేసిన నిర్మాత...

ఎనర్జిటిక్ స్టార్ రామ్,సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

చిరు మూవీలో నటించే హీరోయిన్ డీటైల్స్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అఖిల్ మూవీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు..

అక్కినేని అఖిల్ రెండో సినిమాను అందాల రాక్షసి,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడితో చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.