close
Choose your channels

ఆశ‌ల‌న్నీ మ‌హేష్‌పైనే..

Thursday, October 29, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'అత్తారింటికి దారేది' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ త‌రువాత త‌న జాత‌కం మారుతుంద‌నుకున్న క‌న్న‌డ కోమ‌లి ప్ర‌ణీత‌కి.. ఆ త‌రువాత ఒక్క‌టంటే ఒక్క హిట్ దొరికితే ఒట్టు. సోలో హీరోయిన్‌గా చేసినా.. సెకండ్ హీరోయిన్‌గా చేసినా.. తెలుగు సినిమాల ప‌రంగా ఆమె ఖాతాలోకి మ‌రో హిట్ రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో త‌న ఆశ‌ల‌న్నీ త‌న కొత్త చిత్రం 'బ్ర‌హ్మోత్స‌వం' పైనే పెట్టుకుంది ప్ర‌ణీత‌.

ఇప్ప‌టివ‌ర‌కు రెండో హీరోయిన్ వేషాలేసిన ప్ర‌ణీత‌.. ఈ సినిమా కోసం మూడో హీరోయిన్‌గా న‌టిస్తోంది. 'శ్రీ‌మంతుడు' త‌రువాత మ‌హేష్ నుంచి వ‌స్తున్న ఈ సినిమా కూడా మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌ని.. 'అత్తారింటికి దారేది' స్థాయి హిట్ కోసం వేచిచూస్తున్న త‌న‌కి ఆ ఆశ నేర‌వేరుస్తుంద‌ని ప్ర‌ణీత న‌మ్మ‌కంగా ఉంద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.