ప‌వ‌న్‌తో మ‌ళ్లీ ప‌నిచేయాల‌నుకుంటున్న బాపు బొమ్మ‌

  • IndiaGlitz, [Tuesday,May 05 2020]

క‌న్న‌డ బ్యూటీ ప్ర‌ణీత సుభాష్ క‌రోనా ప్ర‌భావంతో ఇబ్బందులు ప‌డుతున్న పేద‌వారికి ఆహారాన్ని అందిస్తుంది. ఆహారాన్ని త‌యారు చేసి స్వ‌యంగా ఆమె పేద‌వారికి పంచుతుండ‌టం విశేషం. లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌ణీత చేస్తున్న సేవ‌ను అంద‌రూ పొగుడుతున్నారు. తాను ప‌బ్లిసిటీ కోసం ఈ ప‌నుల‌ను చేయ‌డం లేద‌ని ప్ర‌ణీత చెప్పుకొచ్చింది. తాను ఎప్ప‌టినుండో సామాజిక సేవ చేస్తున్నాన‌ని ఆమె తెలిపారు. తాను ఎప్ప‌టి నుండో రెండు స్కూల్స్‌ను ద‌త్త‌త తీసుకున్నాన‌ని వాటికి కావాల్సిన వ‌స‌తుల‌ను క‌లగ‌చేయ‌డంతో తాను ముందుంటున్నానని ఆమె తెలిపారు.

ఇక సినిమాల గురించి ఆమె మాట్లాడుతూ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాన‌ని తెలిపారు. ఏకంగా తాను రెండు సినిమాల్లో న‌టించ‌బోతున్నాన‌ని ఆమె తెలిపారు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో క‌లిసి భుజ్ సినిమాలో న‌టిస్తున్నారు. అలాగే మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరెక్కిస్తోన్న మ‌రో బాలీవుడ్ మూవీలోనూ న‌టించ‌బోతున్నాన‌ని ఆమె తెలిపారు. అత్తారింటికి దారేది త‌ర్వాత త‌న‌కు మంచిరోల్స్ రాలేద‌ని ఆమెతెలిపారు. ప‌వ‌న్‌తో క‌లిసి అత్తారింటికి దారేది సినిమాల న‌టించ‌డాన్నిఎంజాయ్ చేశాన‌ని చెప్పిన ప్ర‌ణీత మ‌రోసారి ప‌వ‌న్‌తో న‌టించే అవకాశం వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని తెలిపారు ప్ర‌ణీత‌.