సినీ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్: ‘‘ప్ర‌సాద్స్‌ ’’ మ‌ల్టిప్లెక్స్ ఇక నుంచి ఐమాక్స్ కాదు.. ఎందుకంటే?

  • IndiaGlitz, [Saturday,December 18 2021]

హైదరాబాద్.. వందల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. మహ్మద్ కులీకుతుబ్ షా నిర్మించిన ఈ భాగ్యనగరంలో ఎన్నో టూరిస్ట్ స్పాట్‌లు. గోల్కండ కోట, చార్మినార్, కుతుబ్ షాహి టాంబ్స్, ఫలక్‌నుమా ప్యాలెస్, రామోజీ ఫిల్మ్ సిటీ, నెక్లెస్ రోడ్, సాలర్‌జంగ్ మ్యూజియం ఇలా ఎన్నో వున్నాయి. అయితే నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన ‘‘ప్రసాద్ ఐ మ్యాక్స్’’ కూడా వీటిలో ఖచ్చితంగా వుంటుంది. హైదరాబాద్‌కు ఎవరొచ్చినా ప్రసాద్స్‌లో సినిమా చూడనిదే వెళ్లరు.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ 3D స్క్రీన్. ఐమాక్స్ ఫార్మాట్‌లో అతిపెద్ద స్క్రీన్ మీద సినిమాల‌ను ప్రదర్శించిన మొట్ట‌మొద‌టి ఐమాక్స్ స్క్రీన్.. ప్ర‌సాద్స్ మ‌ల్టిప్లెక్సే. అయితే ఇక నుంచి ఐమాక్స్ ఎక్సపీరియన్స్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండదట. ఐమాక్స్ అన‌లాగ్ ప్రొజెక్ట‌ర్ ద్వారా గతంలో ప్ర‌సాద్ మ‌ల్టిప్లెక్స్‌లో ఐమాక్స్ ప్రింట్‌(రీల్‌)ను ప్రొజెక్ట్ చేసి సినిమాను ప్ర‌ద‌ర్శించేవారు. కానీ.. ఇప్పుడంతా డిజిట‌లైజేష‌న్ . గతంలో మాదిరి రీల్స్ లేవు. సినిమాల‌ను తీసేది కూడా డిజిట‌ల్ ఫార్మాటే కావడంతో.. రిలీజ్ కూడా డిజిట‌ల్‌గా మారిపోయింది.

ఐమాక్స్ స్క్రీనింగ్‌ను ఇప్పుడు ప్ర‌సాద్ మ‌ల్టిప్లెక్స్ స‌పోర్ట్ చేయడం లేదు. అయితే మారుతున్న కొత్త జనరేషన్‌కు తగినట్లుగా ప్ర‌సాద్స్ మ‌ల్టిప్లెక్స్‌ను స‌రికొత్త‌గా తీర్చిదిద్దారు. ఐమాక్స్ స్క్రీన్ లేకున్నా.. ఇత‌ర లార్జ్ స్క్రీన్ల మీద కొత్త సినిమాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తెలుగుతో పాటు హాలీవుడ్ సినిమాల వరకు ఏదైనా ఇక్కడ విడుదల అవుతున్నాయి. హైదరాబాద్‌లో అప్పటికీ, ఇప్పటికీ ఎన్నో మల్టిప్లెక్స్‌లు వచ్చినా నేటీకి సినీ ప్రియులు ప్రసాద్స్‌లో సినిమా చూడడానికి ఎగబడుతున్నారంటే దాని క్రేజ్ అర్దం చేసుకోవచ్చు.

More News

రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌లు ఎవరో తెలుసా..?

బాహుబలి, సాహో తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

ఆది సాయికుమార్ కొత్త సినిమా టైటిల్ లాంఛ్ చేసిన డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సినిమా టైటిల్ సి.ఎస్.ఐ. స‌నాత‌న్  ని లాంఛ్ చేసారు సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి.

విజయ్ ఆంటోనీ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎమోషన్ థ్రిల్లర్‌  "విక్రమ్ రాథోడ్"

విజయ్ ఆంటోనీ... తమిళ సినిమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో.

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరిని వెనకనుంచి వాటేసుకున్న షన్నూ.. ఇంత ఓవరాక్టింగ్‌ బ్యాచ్‌ ఏంట్రా అంటూ సన్నీ

బిగ్‌బాస్ 5 తెలుగు ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ జర్నీలు పూర్తవ్వగా... ఫైనల్‌లో ఎలాగైనా గెలవాలని ఎవరి ప్లాన్లు వారు వేసుకుంటున్నారు.

భీమ్లా నాయక్ : వికారాబాద్‌లో కొత్త షెడ్యూల్.. పవన్‌ను చూసేందుకు ఎగబడ్డ జనం

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’.