అధునాతన హంగులతో ప్రసాద్'స్ మల్టీప్లెక్స్

  • IndiaGlitz, [Thursday,July 29 2021]

ప్రసాద్'స్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి, ఆ తర్వాత కాసేపు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డులో షికారుకు వెళ్లడం భాగ్యనగర ప్రజలకు అలవాటు. వీకెండ్ వస్తే చాలామంది ఉద్యోగులు చేసేదీ ఇదే. హైదరాబాద్ వచ్చే ఇతర ప్రాంతాల ప్రజలు సందర్శించే ప్రాంతాల్లో ప్రసాద్'స్ మల్టీప్లెక్స్ ఒకటిగా మారింది. ఇప్పుడీ మల్టీప్లెక్స్‌ను అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. సరికొత్తగా ముస్తాబయిన స్క్రీన్లు జూలై 30, శుక్రవారం ‌ నుండి ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా రెండో దశ తర్వాత థియేటర్లలో విడుదలకు సిద్ధమైన చిత్రాలను ప్రదర్శించడానికి ప్రసాద్'స్ మల్టీప్లెక్స్ సిద్ధమైంది.

ఈ సందర్భంగా ప్రసాద్'స్ గ్రూప్ అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రసాద్'స్ మల్టీఫ్లెక్స్ రెన్నోవేషన్ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ప్రేక్షకులకు కొత్త స్క్రీన్లు మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తాయి. సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులకు మంచి వాతావరణం కల్పించాలన్నదే మా ఉద్దేశం. కరోనా వల్ల సినీ పరిశ్రమకు, ప్రజలకు చాలా హాని జరిగింది. ప్రజల ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని మల్టీప్లెక్స్ ను తీర్చిదిద్దాం. మేం ఈ మల్టీప్లెక్స్ కట్టిన నాటి నుండి నేటివరకూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని అప్‌డేట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. రెన్నోవేషన్ కోసం భారీగా ఖర్చు అయినప్పటికీ, ప్రేక్షకుల కోసం సరికొత్తగా మల్టీప్లెక్స్ ను తీర్చిదిద్దాం. త్వరలో ఐమాక్స్ తెరను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. మా నాన్నగారు ఎల్వీ ప్రసాద్ సినిమానే జీవితంగా బతికారు. దేశంలో ఒక గొప్ప నిర్మాతగా ఎదిగారు. ఆయన పిల్లలుగా మేం సినీ పరిశ్రమకు ఎంత సేవ చేయాలో అంతా చేస్తున్నాం. సినీ రంగంలో ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది అని అన్నారు.

More News

సాలిడ్ టీఆర్పీ నమోదు చేసిన వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ఈ ఏడాది విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

RRR: నా మైండ్ లోనుంచి పోవట్లేదు.. 'దోస్తీ' సాంగ్ పై హేమచంద్ర

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్.

హాట్ ఫోటోస్: బ్రాలో పరువాల హొయలు.. సారా స్టన్నింగ్ ఫోజులు

బాలీవుడ్ లో ఫ్యూచర్ జనరేషన్ స్టార్ హీరోయిన్ పరిగణింపబడుతోంది సారా అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా..

బలవంతంగా ముద్దులు పెట్టాడు..పెళ్ళైన వ్యక్తితో సంబంధం పెట్టుకోను

పోర్న్ చిత్రాల వివాదంలో రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.

అరవీర భయంకరుడు అధీరా.. కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ లేటెస్ట్ లుక్

బాలీవుడ్ సీనియర్ నటుడు, వివాదాలకు నెలవు అయిన సంజయ్ దత్ పుట్టినరోజు నేడు. సంజయ్ దత్ 62వ పడిలోకి అడుగుపెట్టారు.