వైరల్ అవుతున్న డిసెంబర్ నాటి పీకే ట్వీట్..

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అద్భుతమైన విజయం దిశగా దూసుకెళుతోంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి మరీ టీఎంసీ దూసుకెళ్లడంతో ఆ పార్టీకి హ్యాట్రిక్ ఖాయమైపోయింది. ఇప్పటి వరకూ ఆ పార్టీ 200 పైగా స్థానాల్లో ముందంజలో ఉండగా.. బీజేపీ 80 స్థానాల్లోనే ముందంజలో కొనసాగుతోంది. టీఎంసీకి వెన్నుదన్నుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రాష్ట్రం విషయమై పీకే గతంలో చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ రెండెకలకే పరిమితమవుతుందని ఆయన ఆ ట్వీట్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఫలితాలను చూస్తుంటే ఆయన చెప్పింది అక్షరాలా జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది.

Also Read: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ ముందంజ..

నిజానికి ప్రచారంలో దీదీ ఒక్కరే కనిపించారు. బీజేపీ ఆమెను అన్ని విధాలుగా బ్లాక్ చేయాలని చూసినా ఆమె మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు. టీఎంసీకి అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరుఫున ప్రధాని మోదీ సహా అతిరథ మహారథులంతా వచ్చి వెస్ట్ బెంగాల్‌లో మకాం వేసి మరీ ప్రచారం నిర్వహించారు. అయిన్పటికీ దీదీ ఏమాత్రం తొణకకుండా, బెణకకుండా తన పని తాను చేసుకుపోయారు. ఇంతటి ధైర్యానికి ఒకరకంగా ప్రశాంత్ కిషోర్ కూడా కారణమనే చెప్పాలి. అయితే ఎన్నికలకు కొద్ది నెలల ముందు పీకేకు, బీజేపీకి ట్విటర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది.

దీంతో కమలం పార్టీకి గట్టి కౌంటరే పీకే ఇచ్చారు. ఈ నేపత్యంలో గతేడాది డిసెంబర్ 21న పీకే చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బీజేపీకి మద్దతుగా నిలిచి ఎంత భారీ హైప్‌ని క్రియేట్ చేసినప్పటికీ ఆ పార్టీ రెండంకెల కంటే మించి సీట్లు సాధించేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ ట్వీట్‌ను సేవ్ చేసుకోండి.. బీజేపీ గనుక అంతకు మించి సీట్లు సాధిస్తే నేను ట్విటర్ నుంచి వైదొలుగా!’’ అని పీకే ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పీకే చెప్పింది అక్షరాలా నిజమయ్యేలా ఉంది. 200కి పైగా స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉండగా.. 80 స్థానాల్లోనే బీజేపీ ముందంజలో ఉంది.

More News

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ ముందంజ..

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి రెండు లక్షలకు పైగా మెజారిటీతో కొనసాగుతున్నారు.

సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.

వార్నర్ అవుట్.. విలియమ్సన్ ఇన్..

ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ గెలుచుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేసింది.

బాడీ బిల్డర్ జగదీష్ లాడ్ కరోనాతో మృతి

బాడీ బిల్డర్ల గురించి మాట్లాడగానే మనకు గుర్తొచ్చే పేరు జగదీష్ లాడ్. బాడీ బిల్డింగ్‌లో ఎన్నో టైటిల్స్ గెలుచుకుని మిస్టర్ ఇండియాగా పేరు తెచ్చుకున్న జగదీష్ లాడ్

ఇండియా నుంచి వస్తే ఐదేళ్ల జైలు: ఆస్ట్రేలియా ప్రభుత్వం

ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశ పౌరులపై కఠిన నిబంధన విధించింది.