close
Choose your channels

ప్రారంభమైన ప్రశాంత్ వర్మ సూపర్ హీరో మూవీ 'హను మాన్'!

Friday, June 25, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో ఛాలెంజింగ్ చిత్రానికి రెడీ అయిపోయారు. అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలతో తానేంటో నిరూపించుకున్న ప్రశాంత్ వర్మ ఈసారి 'హను మాన్' చిత్రంతో పెద్ద టార్గెట్టే పెట్టుకున్నాడు. విజువల్ వండర్ గా తెరకెక్కబోయే ఈ సూపర్ హీరో చిత్రం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.

ఇదీ చదవండి: అల్లరి నరేష్ మూవీ రీమేక్.. చేతులు కలిపిన దిల్ రాజు, అజయ్ దేవ్‌గణ్‌

ప్రారంభానికి ముందే హను మాన్ మూవీ పై భారీ అంచనాలు మొదలయ్యాయి. కేవలం టైటిల్ టీజర్ తోనే ఈ చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. ఈ మూవీలో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగులో తెరకెక్కుతున్న తొలి సూపర్ హీరో చిత్రం ఇది. జాంబీ రెడ్డి తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ప్రీమియర్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉండబోతోందని అంటున్నారు.

సూపర్ హీరో చిత్రాలకు ఇటీవల క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హను మాన్ చిత్రం కూడా ప్రేక్షకులని థియేటర్స్ కు రప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉండగా పూజా కార్యక్రమంలో జెమిని కిరణ్, నిర్మాత సి కళ్యాణ్ పాలొన్నారు.

జెమిని కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సి కళ్యాణ్ క్లాప్ ఇచ్చారు. శివ శక్తి దత్త తొలి షాట్ కు దర్శకత్వం వహించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జతో పాటు చిత్ర యూనిట్ ఈ కారక్రమంలో పాల్గొంది. నిరంజన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. దాశరథి శివేంద్ర డీఓపీగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.