'ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,March 22 2018]

జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం చేస్తూ రాజా వన్నేం రెడ్డి దర్శకత్వంలో భారీ హంగులతో అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ మూవీ లో మనీష్ బాబుకి జోడిగా హీరోయిన్ అక్షిత నటిస్తుంది. 

నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ: గత 20  సంవత్సరాలనుండి తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా ఉంటూ అనేక చిత్రాలను నిర్మిస్తున్న మా సంస్థ నుండి మనీష్ బాబు ని పరిచయం చేస్తూ ఈ 'ప్రశ్నిస్తా' మూవీ ని ప్రారంభించడం జరిగింది.

'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాజా వన్నేం రెడ్డి మనీష్ లోని టాలెంట్ ని చూసి తానే మనీష్ ని వెండితెరకు పరిచయం చేస్తానని... గత రెండేళ్లుగా మనీష్ కి నటనలో శిక్షణ ఇప్పిస్తూ డైలాగ్ దగ్గరనుండి, డాన్స్ లు వంటి వాటిని దగ్గరనుండి శిక్షణ ఇప్పించి మరీ మనీష్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు.

మనీష్ మీదున్న ప్రేమతో మంచి సబ్జెక్టు ని తీసుకుని ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం మొదలు పెట్టారు. అలాగే హీరోయిన్ అక్షిత కూడా మన తెలుగమ్మాయి, మరో దివ్య భారతి లాంటి అందంతో.. నటనలో ఈ సినిమాతో అక్షిత మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని నమ్మకం వుంది అన్నారు. ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన, అలాగే మా బాబు మనీష్ అశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాని ముగించారు. 

దర్శకుడు రాజా వన్నేం రెడ్డి మాట్లాడుతూ: అందరూ సక్సెస్ వెంట పరిగెడుతున్న ఈ రోజుల్లో నిర్మాత సత్యారెడ్డి నన్ను నమ్మి తన కొడుకు మనీష్ బాబుని నాకు అప్పగించారు. నేను మనీష్ బాబుని మంచి హీరోగా తీర్చిదిద్దడానికి కావాల్సిన శిక్షణ ఇప్పించి మరీ ఒక మంచి కథతో... కమర్షియల్ హీరోగా తయారు చెయ్యాలని... నేనే మళ్ళీ నా మొదటి సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను అన్నట్టుగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సమయంలో మా గురువు గారు దాసరి నారాయణ రావు గారు ఉంటే చాలా సంతోష పడేవారు. ఎందుకంటే ఈ సినిమా సబ్జెక్టు ఆయనకు కూడా తెలుసు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను.

హీరో మనీష్ బాబు మాట్లాడుతూ: రాజా వన్నేం రెడ్డి గారు మా ఇంట్లో మనిషిగా కలిసి పోయి నా విషయంలో చాలా కేర్ తీసుకుని నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు చాలా సంతోషం గా వుంది. నేను హీరో అవ్వాలన్న నా కోరికను రాజా వన్నేం రెడ్డి గారు గుర్తించి నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గాను నేను ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటాను. మంచి కథాంశంతో వస్తున్న ఈ చిత్రం మీ అందరికి నచ్చుతుంది అని నమ్ముతున్నాను. వన్నేం రెడ్డి గారు చెప్పిన కథని నమ్మి... నాన్న సత్యారెడ్డి గారు చాలా మంది నిర్మతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తామని  చెప్పినా... కాదని ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ: నా టాలెంట్ ని నమ్మి దర్శక నిర్మతలు నాకు ఈ మూవీ లో నటించే అవకాశమిచ్చారు.. వాళ్లకు నా కృతఙ్ఞతలు.

టెక్నీకల్ లిస్ట్: 
సమర్పించువారు: బి. శేషుబాబు,  రచయిత: రాజేంద్ర కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ రెడ్డి, కో ప్రొడ్యూసర్స్: కె. నారాయణ రెడ్డి, శంకర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: యోగి రెడ్డి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, మ్యూజిక్ డైరెక్టర్: ఎల్. ఎం ప్రేమ్,  డైరెక్టర్: రాజా వన్నేం రెడ్డి, నిర్మాత: సత్యా రెడ్డి

More News

రెండోసారి కూడా అలాగే..

హైప‌ర్‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ఫ‌లితాల‌తో నిరాశ‌పడ్డ యువ క‌థానాయ‌కుడు రామ్‌.. త‌దుప‌రి చిత్రాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

చంద్ర‌బాబు చేతుల మీదుగా జొన్న‌విత్తుల ప‌ద్య వాద్య క‌చేరి విడుద‌ల‌

తెలుగు పదాలకు పద్యాలకు వన్నె తెచ్చిన కవులు మన చరిత్రలో చాలా మందే వున్నారు.

45 దియోట‌ర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న'ఛ‌లో'

నాగ‌సౌర్య హీరోగా, ర‌ష్మిక హీరోయిన్‌గా వెంకి కుడుముల ని ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం చేస్తూ ఐరా క్రియేషన్స్ బ్యానర్లో శంకర్ ప్రసాద్ స‌మ‌ర్ప‌ణ‌లో, ఉష నిర్మాతగా  నిర్మించిన చిత్రం ఛ‌లో..

అందరూ ఇది మన కథ అనుకోని చూడాల్సిన సినిమా 'నీది నాది ఒకే కథ' - ప్రీరిలీజ్ ఈవెంట్ లో యువకథానాయలు

శ్రీ విష్ణు హీరో గా నటించిన 'నీది నాది ఒకే కథ' చిత్రం మార్చ్ 23 న విడుదల కానుంది. టీజర్ మరియు పాటలకు అద్భుత స్పందన వస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్టూడెంట్ గా కనిపించనున్నారు.

సినిమాల‌కు శంక‌ర్ హీరోయిన్ బై...

మ‌ద‌రాసు ప‌ట్ట‌ణం అనే త‌మిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది బ్రిటీష్ సుంద‌రి ఎమీ జాక్స‌న్‌. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాల్లో ఎమీజాక్స‌న్ న‌టించి ఆక‌ట్టుకుంది.