జులై1న 'ప్రేమలీల..పెళ్ళి గోల' విడుదల

  • IndiaGlitz, [Tuesday,June 13 2017]

ఇటీవ‌ల త‌మిళ్ లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన 'వెల్లై కార‌న్' చిత్రాన్ని 'ప్రేమ‌లీల‌-పెళ్ళి గోల' టైటిల్ తో మ‌హా వీర్ పిలిమ్స్ అధినేత‌ నిర్మాత పార‌స్ జైన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. విష్ణు విశాల్, నిక్కీ గ‌ల్రానీ నాయ‌కానాయిక‌లుగా న‌టించారు. ఎళిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని జులై 1న రిలీజ్ అవుతుంది.
ఈ సంద‌ర్భంగా...
శ్రీ మ‌హావీర్ ఫిలింస్ అధినేత,నిర్మాతపార‌స్ జైన్ మాట్లాడుతూ' ప్రేమ‌లీల ఒకరిది. పెళ్ళి గోల మ‌రొక‌రిది. అదే ఈ సినిమా క‌థ‌. కామెడీ..ల‌వ్ ..ఎమోష‌న్స్ అన్నీ అంశాల‌తో ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ గా తెర‌కెక్కింది. మాతృక‌లో సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగు లో ఆ స్థాయి విజ‌యాన్ని అందుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. తొలి కాపీ సిద్దమైంది. సినిమా చూసిన వాళ్లంతా ఆద్యంతం క‌డుపుబ్బా న‌వ్వుకునే సినిమా అని ప్ర‌శంసించారు. ముఖ్యంగా ద్వితియార్థంలో సాగే కామెడీ హైలైట్ గా ఉంటుంది. జులై 1న సినిమా విడుద‌ల‌ చేస్తున్నాం' అని అన్నారు.
చిత్ర హీరో విష్ణు విశాల్ మాట్లాడూతూ ' ఐటీ ఉద్యోగం చేసుకుంటోన్న స‌మ‌యంలో త‌మిళ్ సినిమాల్లో అవ‌కాశం రావ‌డంతో హీరోగా ట‌ర్న్ అయ్యా. 'వెన్నైలా క‌బాడీ కుజు' ('భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు') చిత్రం నాకు మంచి గుర్తింపునిచ్చింది. ప్ర‌స్తుతం కొన్ని సినిమాల‌తో బిజీగా ఉన్నా. ఇటీవ‌ల విడుద‌లైన 'వెల్లై కార‌న్' చిత్రం మంచి బ్రేక్ నిచ్చింది. త‌మిళ్ లో పెద్ద హిట్ అయింది. జులై 1న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. అంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా' అని అన్నారు.

More News

ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో 'బిగ్ బాస్' ను ప్రారంభించనున్న స్టార్ మా

"సరికొత్త ఉత్తేజం" అనే నినాదం తో తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని అందించాలని భావించే ఛానల్ స్టార్ మా. ఈ సంకల్పం తో నే తెలుగు టీవీ చరిత్ర లో నే అతి పెద్ద షో, "బిగ్ బాస్", ను ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తోంది స్టార్ మా.

ఈద్ సందర్భంగా 'విశ్వరూపం2' టీజర్

లోకనాయకుడు కమల్ హాసన్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వరూపం2'

మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన దర్శకుడి కారు...

మెట్రో పిల్లర్స్ ను ఈ మధ్య తరుచుగా కార్లు,ఇంకా ఇతర వాహనాలు ఢీ కొంటున్నాయి.

ఆగస్ట్ 11న యూత్ స్టార్ నితిన్-హను రాఘవపూడి-14 రీల్స్ భారీ చిత్రం 'లై'

యూత్స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్మిటి).

మహేష్ అయితే ఏంటి..?

సూపర్స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన `శ్రీమంతుడు` చిత్రం మహేష్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది.