'ప్రేమలీల పెళ్ళిగోల' ట్రైలర్ ఆవిష్కరణ

  • IndiaGlitz, [Saturday,June 24 2017]

ఇటీవ‌ల త‌మిళ్ విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన 'వెల్లై కార‌న్' చిత్రాన్ని 'ప్రేమ‌లీల‌-పెళ్ళి గోల' టైటిల్ తో మ‌హా వీర్ పిలిమ్స్ అధినేత‌ నిర్మాత పార‌స్ జైన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్, నిక్కీ గ‌ల్రానీ నాయ‌కానాయిక‌లుగా న‌టించారు. ఎళిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 'జ‌ర్నీ' ఫేం స‌త్య సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లో జ‌రిగింది.
శ్రీ మ‌హావీర్ ఫిలింస్ అధినేత, నిర్మాత పార‌స్ జైన్ మాట్లాడుతూ ' త‌మిళ్ లో ఈ సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్యా. ఎలాగైనా ఈ చిత్రాన్ని మ‌న ఆడియ‌న్స్ కు అందించాల‌ని చాలా మంది పోటీ పడ్డా..నా మీద న‌మ్మ‌కంతో విశాల్ నాకు రైట్స్ ఇచ్చారు. ముందు ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నుకున్నా. కానీ విశాల్ రీమేక్ చేస్తే కామెడీ మిస్ అవుతుంద‌న‌డంతో డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. చ‌క్క‌ని హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. తెలుగు ఆడియ‌న్స్ కు బాగా నచ్చే సినిమా అవుతుంది. ఈరోజే ఎస్. వికృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారుతో పాటు ప‌ల‌వురు సినీ పెద్ద‌ల స‌మ‌క్షంలో ప్రివ్యూ చూశాం. సినిమా చూసిన వారంతో బాగుంద‌ని ప్ర‌శంసించారు. స్ర్టెయిట్ మూవీ చూసిన ఫిలింగ్ క‌ల్గిందన్నారు. ఇక నా సినిమా కెరీర్ ఎస్. వికృష్ణ‌రెడ్డి గారితో నే మొద‌లైంది. ఆయ‌న చేసిన ఎన్నో సినిమాలు మా సంస్థ‌నే రిలీజ్ చేసింది. వాళ్లంద‌రి ఎంక‌రేజ్ మెంట్ నాకు ఉండ‌టం సంతోషంగా ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల‌తో పాటు క‌ర్ణాట‌క‌, ఒరిస్సా రాష్ర్టాల్లో జులై 1న సినిమా రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు.
నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ ' మ‌హా వీర్ ఫిలిమ్స్ మా సినిమాల‌నే మొద‌ట‌గా రిలీజ్ చేసింది. త‌ర్వాత అదే సంస్థ ఎన్నో సినిమాల‌ను సీడెడ్ లో పంపిణీ చేసింది. ఈరోజు సినిమా చూశాం చాలా బాగుంది. జంధ్యాల గారి ఆహ‌నా పెళ్లంట‌..కృష్టారెడ్డి గారి కామెడీ సినిమాల్లా ఉంది. క‌డుపుబ్బా న‌వ్వుకునే హ‌స్య స‌న్నివేశాలున్నాయి. ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ లో వ‌చ్చే కామెడీ హైలైట్ గా ఉంటుంది. హీరో, హీరోయిన్లు చ‌క్క‌గా న‌టించారు. జులై 1న ప్రేక్ష‌కుల మందుకు వ‌స్తుంది. పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాం' అని అన్నారు.
ద‌ర్శ‌కుడు ఎస్. వి.కృష్ణారెడ్డి మాట్లాడూతూ ' పార‌స్ జైన్ గారు కామ‌న్ ఆడియ‌న్ లో ఆలోచిస్తారు. సినిమా స‌క్సెస్ ను ముందే అంచ‌నా వేయ‌గ‌ల వ్య‌క్తి. ఆయ‌న పంపిణీ చేసిన ప్ర‌తీ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమా కూడా ఆకోవ‌లో నిలుస్తుంది. సినిమా చూశాను. హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. నేను ఏ కామెడీని న‌మ్ముతానో ఆ కామెడీ ఈ సినిమాలో ఉంది. ముఖ్యంగా కొన్ని కామెడీ స‌న్నివేశాలు ఒక రేంజ్ దాటి వెళ్లిపోయాయి. సినిమా చూసిన ప్ర‌తీ ప్రేక్ష‌కుడు క‌డుపుబ్బా న‌వ్వ‌డం ఖాయం. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ నచ్చే సినిమా అవుతుంది' అని అన్నారు.
చిత్ర హీరో విష్ణు విశాల్ మాట్లాడూతూ 'త‌మిళ్ లో పెద్ద హిట్ అయింది. తెలుగులో విడుద‌ల‌వుతోన్న తొలి సినిమా ఇది. జులై 1న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. మంచి హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నా' అని అన్నారు.
హీరోయిన్ నిక్కిగ‌ల్రానీ మాట్లాడుతూ, 'మంచి సినిమా ఇది. అన్ని పాత్ర‌ల్లోనూ హ‌స్యం ఉంటుంది. థియేట‌ర్ కు వ‌చ్చిన ప్ర‌తీ ప్రేక్ష‌కుడు న‌వ్వు కోవ‌డం ఖాయం. జులై1న సినిమా విడుద‌ల‌వుతుంది. పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది' అని అన్నారు.

More News

'మామ్' ఎమోషనల్ ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ - శ్రీదేవి

ఆల్ఇండియా స్టార్శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్'. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది.

హన్సిక కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర 'స్పూర్తి'

శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "గౌతమ్ నంద". గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంపత్ నంది దర్శకుడు.

రాజకీయ రంగ ప్రవేశంపై రజనీ కామెంట్..

ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రజనీకాంత్ ఇదిగో వచ్చేస్తున్నాడు..అదిగో

నాకు ఎలాంటి సంబంధం లేదు - నటి జీవిత

శ్రీనివాస క్రియేషన్స్ సంస్థపై దాడి చేసిన వెస్ట్జోన్ పోలీసులు దొంగ నోట్లను స్వాధీనం చేసుకుని శ్రీనివాస్,రవి అనే ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

గండిపేటలో 'మహానటి' సెకండ్ షెడ్యూల్

అలనాటి మేటినటి సావిత్రి బయోపిక్ మూవీ 'మహానటి'