డిసెంబర్ 6 'ప్రేమంటే సులువు కాదురా' ఆడియో వేడుక!!

  • IndiaGlitz, [Friday,December 04 2015]

యువ ప్రతిభాశాలి చందా గోవింద్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆర్‌.పి.క్రియేషన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథా చిత్రం ప్రేమంటే సులువు కాదురా'. కొమారి సుధాకర్‌రెడ్డి-శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో.. సిమ్మీదాస్‌ హీరోయిన్‌. ఈ చిత్రం ఆడియో..

ఆదివారం (డిసెంబర్‌ 6) సాయంత్రం 6 గం॥లకు ప్రముఖ ఆడియో కంపెనీ మధుర మ్యూజిక్‌' ద్వారా విడుదల కానుంది. హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ ధియేటర్‌ ఇందుకు వేదిక కానుంది. పలువురు ప్రముఖులు ఈ పాటల వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు. కృష్ణ మదినేని సాహిత్యం సమకూర్చిన ఈ చిత్రానికి యువ సంగీత తరంగం నందన్‌రాజ్‌ స్వర సారధ్యం వహిస్తుండగా.. ప్రాణం' కమలాకర్‌ నేపధ్య సంగీతం అందిస్తున్నారు!!

More News

చెన్నై కోసం 'నేను సైతం' అంటున్న రకుల్ ప్రీత్ సింగ్

అధిక వర్షాల కారణంగా నానా ఇబ్బందులకు గురవుతున్న చెన్నై వాసులకు మన తెలుగు కథానాయకులు ఆసరాగా నిలుస్తున్న విషయం తెలిసిందే.

వైజాగ్ లో చైతు, శ్రుతి..

యువ సమ్రాట్ నాగ చైతన్య హీరోగా కార్తీకేయ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్ రీమేక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

కోనకి కోపం వచ్చింది..

స్టార్ రైటర్ కోన వెంకట్ కథ, కథనం అందించడంతో పాటు చిత్ర సమర్పకుడిగా వ్యవహరించిన తాజా చిత్రం శంకరాభరణం. ఈ మూవీలో నిఖిల్, నందిత జంటగా నటించారు. ఎన్నో అంచనాలతో శంకరాభరణం ఈరోజు రిలీజైంది.

సునీల్ మూవీ టైటిల్...

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ సినిమా విడుదలైన చాలా కాలమైంది.ప్రస్తుతం కృష్ణాష్టమి విడుదలకు సిద్ధమవుతుంది.

శంకరాభరణం మూవీ రివ్యూ

ఈ మధ్య తెలుగు సినిమా అంతా ఎన్నారైల చుట్టూనే తిరుగుతుంది. తను కూడా తిరిగితే తప్పేంటి అనుకున్నాడేమో కానీ స్టార్ రైటర్ పట్టంతో ఉన్న కోనవెంకట్ ఇప్పుడు అలాంటి కథను రాసుకున్నాడు. అత్తారింటికి దారేది, పండగచేస్కో సినిమాల తరహాలో ఈ సినిమా అంతా ఎన్నారైల చుట్టూనే నడిపాడు.