close
Choose your channels

ప‌వ‌న్ కోసం సిద్ధమవుతోన్న సెట్

Tuesday, November 5, 2019 • తెలుగు Comments

ప‌వ‌న్ కోసం సిద్ధమవుతోన్న సెట్

జ‌న‌సేన‌నాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సినిమా `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దిల్‌రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు పింక్ సినిమా ఓ కోర్టు డ్రామా. సినిమా ఎక్కువ భాగం కోర్టులోనే న‌డుస్తుంది. కాబ‌ట్టి ఈ కీల‌కమైన స‌న్నివేశాల కోసం నిర్మాత‌ల దిల్‌రాజు అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో ఓ ఫ్లోర్‌ను అద్దెకు తీసుకున్నార‌ట‌. అందులో ఓ కోర్టు సెట్ వేయించ‌బోతున్నార‌ని, త్వ‌ర‌లోనే ఆర్ట్ వ‌ర్క్ స్టార్ట్ అవుతుంద‌ని స‌మాచారం.

ప‌వ‌న్ రీ ఎంట్రీపై ప‌లు వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ ముందు తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌న‌ని చెప్పినా చివ‌ర‌కు ఉన్న క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేయ‌డానికి ప‌వ‌న్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. అదీ కాక వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌టంతో ఆలోపు ప‌వ‌న్ త‌న సినిమాల‌ను పూర్తి చేయాల‌నుకుంటున్నాడు. ఈసినిమా స్క్రీన్‌ప్లే `పింక్` త‌మిళ రీమేక్ `నేర్కొండ పార్వ్యై` త‌ర‌హాలో ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz