close
Choose your channels

వివాదంలో సన్నీ లియోన్ కొత్త ఆల్బమ్.. భగ్గుమంటున్న హిందువులు

Saturday, December 25, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వివాదంలో సన్నీ లియోన్ కొత్త ఆల్బమ్.. భగ్గుమంటున్న హిందువులు

‘సన్నీ లియోన్’... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పలు నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ‘జిస్మ్ 2’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమయ్యారు. ఆ చిత్రంలో ఈ హాట్ గాళ్ ఏమాత్రం దాచుకోకుండా నటించి యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారులో సన్నీకి చాలా క్రేజ్ నెలకొంది. అసలు ఆమె హిందీ చిత్ర రంగంలో అడుగుపెట్టడానికి ఐదో సీజన్ లో జరిగిన బిగ్ బాస్ రియాల్టీ షోనే. అలా జిస్మ్ 2లో అవకాశాన్ని చేజిక్కించుకున్న సన్నీ లియోన్ బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ వరుస అవకాశాలు చేజిక్కించుకుని దూసుకెళ్తోంది. సన్నీ లియోన్‌కి అందంతోపాటు మంచి మనసు ఉంది. లాక్‌డౌన్ సమయంలో 10,000 మంది ఢిల్లీ వలస కార్మికులకు ఆహారం ఇవ్వడానికి ఆమె.. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ అఫ్ యానిమల్స్ (పెటా) తో చేతులు కలిపింది. అంతేకాదు ముంబైలోని ఓ స్కూల్‌ను కూడా సన్నీ దత్తత తీసుకున్నట్లు టాక్.

వివాదంలో సన్నీ లియోన్ కొత్త ఆల్బమ్.. భగ్గుమంటున్న హిందువులు

ఇక ఈ భామ‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ఆమె ఏ సాంగ్ చేసినా అది వివాదమై కూర్చుంటుంది. స‌న్నీ లియోన్ లేటెస్ట్ ఆల్బ‌మ్ ‘నాచే.. మై మ‌ధుబ‌న్ రాధిక’ వీడియో సాంగ్ విడుద‌లైన కాసేటికి వివాదానికి దారి తీసింది. ఈ సాంగ్‌ను క‌నికా క‌పూర్, అరింద్ చ‌క్ర‌వ‌ర్తి పాడారు. ఈ పాట హిందూవుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉంద‌ంటూ నెటిజ‌న్లు మండిపడుతున్నారు. కృష్ణుడి ప్రియురాలు రాధ‌ను ఉద్దేశించి ఈ పాట ఉంటుంది. అది ఆమెను అవ‌మాన‌ప‌రిచేలా ఉంద‌నేది నెటిజ‌న్లు అభిప్రాయ‌ం. అటు హిందూ స‌మాజానికి స‌న్నీ లియోన్ బేషరతుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన బ్రాహ్మ‌ణ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

వివాదంలో సన్నీ లియోన్ కొత్త ఆల్బమ్.. భగ్గుమంటున్న హిందువులు

అలాగే స‌న్నీ లియోన్‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోక‌పోతే త‌ప్ప‌కుండా తాము కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని పూజారి సంత్ నావ‌ల్ గిరి మ‌హారాజ్ హెచ్చరించారు. ‘నాచే.. మై మ‌ధుబ‌న్ రాధిక’ పాట‌ను తక్షణం బ్యాన్ చేయాల‌ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. 1960లో విడుద‌లైన కోహినూర్ చిత్రంలో మ‌ధుబ‌న్ మై రాధిక నాచే పాట‌ను ప్రఖ్యాత గాయకుడు ర‌ఫీ ఆలపించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.