సింగ‌ర్‌గా మారిన ప్రియా ప్ర‌కాశ్ ?

  • IndiaGlitz, [Wednesday,June 26 2019]

మ‌ల‌యాళ చిత్రం 'ఒరు ఆడార్ ల‌వ్‌'లో క‌న్నుగీటే స‌న్నివేశంతో నేష‌న‌ల్ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది ప్రియాప్ర‌కాశ్‌వారియ‌ర్‌. అయితే ఒరు ఆడార్ ల‌వ్ ప్లాప్ కావ‌డంతో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. బాలీవుడ్‌లో 'శ్రీదేవి బంగ్లా' అనే సినిమాతో పాటు తెలుగులో నితిన్, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి సినిమాలో న‌టిస్తుంది. ఈమె హీర‌యినే కాదు.. మంచి గాయ‌ని అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసిన వీడియో చూసి అంద‌రూ ఆమెను మంచి గాయ‌ని అని ప్ర‌శంసిస్తున్నారు.

ఇంత‌కు ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది? అంటే మ‌ల‌యాళంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీలో ఓ సాంగ్‌ను సింగ‌ర్ న‌రేశ్ అయ్య‌ర్‌తో క‌లిసి పాడింది ప్రియాప్ర‌కాశ్‌. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మ‌రి భ‌విష్య‌త్‌లో ప్రియా ప్ర‌కాశ్‌ను సింగ‌ర్‌గా కూడా మ‌నం మ‌రిన్ని సినిమాల్లో చూడొచ్చు.

More News

జగన్, మంత్రులపై షాకింగ్ న్యూస్ వెలుగులోకి..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఎంగా వైఎస్ జగన్, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే.

బీజేపీలోకి ‘సమంత’ సపోర్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

నవ్యాంధ్రలో చంద్రబాబుకు కొత్త ఇళ్లు దొరికిందోచ్..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో ఇప్పటికే అమరావతిలోని ఉండవల్లిలో ఉండే ప్రజావేదికను అధికారులు కుప్పకూల్చిన సంగతి తెలిసిందే.

రైతన్నకు జగన్ సర్కార్ శుభవార్త.. టీడీపీకి మరో షాక్!

వైసీపీ అధికారంలోకి వస్తే రైతన్నలకు శుభవార్త చెబుతామని.. ముఖ్యంగా పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో పదేపదే వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.

పీవీ, ప్రణబ్‌‌పై చిన్నారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం నేతల నోరు జారుడు ఎక్కువైంది. మీడియా గొట్టాలు దొరికితే చాలు..