మీటూ గురించి ప్రియ‌మ‌ణి స్పంద‌న‌

  • IndiaGlitz, [Tuesday,October 15 2019]

ద‌క్షిణాది సినిమాల్లో న‌టించి హీరోయిన్‌గా త‌న‌కంటూఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న హీరోయిన్ ప్రియ‌మ‌ణి. ఇటీవ‌ల పెళ్లి చేసుకున్న ఈమె ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌, టీవీ షోస‌ల‌కే ప‌రిమితం అయ్యారు. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె ప‌లు విష‌యాల‌పై ప్ర‌స్తావించారు. అందులో ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్స్‌గా పేరు తెచ్చుకున్న న‌య‌న‌తార‌, అనుష్క‌, స‌మంత రెమ్యున‌రేష‌న్‌ల‌పై మాట్లాడారు. అలాగే మీ టూ ఉద్య‌మం గురించి కూడా మాట్లాడారు.

''ఒక‌ప్పుడు హీరోయిన్స్ సినిమాలు పెద్ద హిట్ అయినా వారికి స‌రైన పారితోష‌కాలు దక్కేవి కావు. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అలా లేవు. న‌టీమ‌ణులు వారి పారితోషం తెలుసుకుని మ‌రీ సినిమాలు చేస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌లుగా న‌య‌న‌తార‌, అనుష్క‌, సుమంత గురించి చెప్పుకోవ‌చ్చు. ఇప్ప‌టికైనా మ‌హిళ‌లు త‌మ స్థాయిని తెలుసుకుని మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది'' అన్నారు ప్రియ‌మ‌ణి. అలాగే మీ టూ ఉద్య‌మం గురించి మాట్లాడుతూ ''మీటూ స‌మ‌స్య చిత్ర రంగానికి సంబంధించిన‌దే కాదు. ప్ర‌తి రంగంలోనూ ఉంది. త‌మ జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి మ‌హిళ‌లు ముందుకొచ్చి మాట్లాడ‌టం మంచిదే. అయితే మీ టూ ఘ‌ట‌న‌లు వినేట‌ప్పుడు గుడ్డిగా న‌మ్మ‌వ‌ద్దు. ప్ర‌జ‌లు ఈ విష‌యంపై సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలి. మీ టూ ప్ర‌భావం చాలా శ‌క్తివంతంగా మారింది. ఇప్పుడు వేధించాలంటే ప్ర‌తి ఒక్క‌రూ భ‌య‌ప‌డుతున్నారు'' అన్నారు.

More News

'మళ్ళీ మళ్ళీ చూశా' ఒక ఫుల్ మీల్స్‌లా ఉంటుంది - హీరో అనురాగ్‌ కొణిదెన

క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ''మళ్ళీ మళ్ళీ చూశా''.

మొదటి సింగిల్ కి ముస్తాబవుతున్న'బ్యూటిఫుల్'

సంచలన దర్శకుడు రామ్ గోపాల్  వర్మ  కొత్త చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయికగా,

షారూక్‌తో అట్లీ క‌న్‌ప‌ర్మ్‌?

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్ ఖాన్ త‌య్రంలో ఒక‌రైన షారూక్‌ఖాన్‌.. త్వ‌ర‌లోనే ఓ సౌతిండియ‌న్ డైరెక్ట‌ర్‌తో

సంక్రాంతి బరిలో వెంకీ మామ?

నిజ జీవితంలో మామా అల్లుడు అయిన వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య అక్కినేని క‌లిసి న‌టిస్తోన్న తాజా చిత్రం `వెంకీమామ‌`.

కోలీవుడ్‌లో క్రికెట‌ర్స్‌

ఇప్పుడు ఇండియ‌న్ క్రికెట‌ర్స్ అంద‌రూ కోలీవుడ్‌లో న‌టిస్తున్నారు. వీరు న‌టించ‌బోయే సినిమాల‌న్నీ అధికారికంగా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాయి.