రెండు సార్లు ఛాన్స్ మిస్.. టాలీవుడ్ స్టార్ హీరోపై ప్రియమణి

  • IndiaGlitz, [Monday,May 31 2021]

వివాహం తర్వాత ప్రియమణి సినిమాల జోరు తగ్గించింది. బుల్లితెర షోలలో కనిపిస్తోంది. ప్రియమణి తెలుగులో నటించి చాలా కాలమే అవుతోంది. ఎన్టీఆర్, నాగార్జున, బాలయ్య లాంటి స్టార్స్ సరసన ప్రియమణి ఆడిపాడింది. తిరిగి తెలుగు ఆడియన్స్ ని పలకరించేందుకు ప్రియమణి రెడీ అవుతోంది.

ప్రస్తుతం ప్రియమణి వెంకటేష్ సరసన నారప్ప చిత్రంలో నటిస్తోంది. అలాగే రానా నటిస్తున్న విరాటపర్వంలో కీలక పాత్ర చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. గతంలో వెంకటేష్ సరసన నటించే అవకాశం రెండు సార్లు మిస్ అయినట్లు తెలిపింది. కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్సులు కోల్పోయినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: దివి స్టన్నింగ్ హాట్: ఎదపై టాటూ.. రేర్ రికార్డ్ కొట్టేసింది

నారప్పలొ అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆఫర్ వదులుకోకూడదు అని డిసైడ్ అయినట్లు తెలిపింది. ఈ సందర్భంగా వెంకటేష్ ఫ్యాషన్ ఉన్న నటుడు అని ప్రశంసలు కురిపించింది. అసురన్ రీమేక్ గా నారప్ప తెరకెక్కుతోంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్లు ప్రియమణి పేర్కొంది.

ఇక విరాటపర్వంలో కూడా తనది కీలకమైన రోల్ అని ప్రియమణి తెలిపింది. నక్సలైట్ భారతక్క పాత్రలో ప్రియమణి నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు కరోనా ప్రభావం తగ్గాక రిలీజ్ కు రెడీ కానున్నాయి.

More News

బుర్రిపాలెంలో మహేష్ బాబు వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో సెలెబ్రిటీలు తమ వంతుగా ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

మాస్ స్టామినా ఇది.. కళ్ళు చెదిరే రికార్డ్ రామ్ సొంతం!

యువ హీరోల్లో రామ్ స్పెషల్ స్కిల్స్ ఉన్న నటుడు. డాన్సులు, నటన, ఫైట్స్ ఇలా ఏదైనా అదరగొట్టేస్తాడు. అందుకే రామ్ ని అభిమానులు ఎనెర్జిటిక్ హీరో అని పిలుచుకుంటారు.

పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా!

హీరోయిన్ ప్రణీత సుభాష్ టాలీవుడ్ లో కొంత కాలం పాటు తన ముద్ర వేసింది. కొన్ని మెమొరబుల్ చిత్రాల్లో నటించింది.

జిమ్ లో ఆమె హాట్ నెస్ చూశారా.. భయంకర నిజం చెప్పిన ఐటెం బ్యూటీ

ఆమె వయసు 47 ఏళ్ళు. కానీ ఓ యంగ్ బ్యూటీ తరహాలో గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె మరెవరో కాదు..

ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఇస్తున్న మందులను ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.