రోల్ కోసం ప్రియ‌మ‌ణి రియ‌ల్ ట్రైనింగ్‌

  • IndiaGlitz, [Thursday,June 11 2020]

కొంద‌రు న‌టీన‌టులు కొన్ని పాత్ర‌ల‌ను ఆషామాషీగా తీసుకోరు. వ‌చ్చిన పాత్ర‌ను, న‌చ్చిన పాత్ర‌ను ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా వెండితెరపై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అలాంటి కొంద‌రు న‌టీమ‌ణుల్లో ప్రియ‌మ‌ణి ఒక‌రు. ఈమె గ్లామ‌ర్ పాత్ర‌లే కాదు.. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌ను కూడా పోషించి ఆక‌ట్టుకుంది. కెరీర్ ప్రారంభంలోనే ఈమెకు ప‌రుత్తివీర‌న్ చిత్రంతో నేష‌న‌ల్ అవార్డును కూడా సొంతం చేసుకోవ‌డం విశేషం. ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్‌గా స్పీడు త‌గ్గ‌డంతో ప్రియ‌మ‌ణి పెళ్లి చేసుకుంది. ఢీ వంటి టీవీ షోస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే అలాంటిదేమీ లేద‌ని వ‌య‌సుకు, పెర్ఫామెన్స్‌కు త‌గ్గ పాత్ర వ‌స్తే చేయ‌డానికి తాను వెనుకాడ‌న‌నే త‌త్వం ప్రియ‌మ‌ణిది. ప్ర‌స్తుతం రెండు విల‌క్ష‌ణ‌మైన చిత్రాల్లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తుంది. అందులో ఒక‌టి నార‌ప్ప‌. ఇందులో వెంక‌టేశ్ స‌ర‌స‌న న‌టిస్తుంది. కాగా రెండో సినిమా విరాట‌ప‌ర్వం. రానా, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి భార‌త‌క్క అనే న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌నిపిస్తారు. ఈ పాత్ర కోసం ప్రియ‌మ‌ణి చాలా బాగా హార్డ్ వ‌ర్క్ చేశార‌ట‌. ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల స‌ల‌హాల‌తో పాటు ఓ మాజీ నక్స‌లైట్ ఆధ్వ‌ర్యంలో ద‌ళం అంటే ఎలా ఉంటుంది? అందులో మ‌హిళ‌లు ఎలా ప‌నిచేస్తారు? ఎలా గ‌న్స్ ప‌ట్టుకోవాలి? అనే అంశాల‌పై ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకున్నార‌ట ప్రియ‌మ‌ణి. మ‌రి ఈ పాత్ర వెండితెర‌పై ఎలా మెప్పించ‌నుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే...

More News

లాస్ట్ షెడ్యూల్ జ‌రుపుకోనున్న 'సీటీమార్'

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై  శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం `సీటీమార్‌`.

BB3 టీజ‌ర్ అదిరిపోయింది అంటున్నారు అంద‌రూ : బాల‌కృష్ణ

'సింహా', 'లెజెండ్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో

మలయాళ రీమేక్ డైరెక్ట‌ర్ ఖ‌రారు?

తెలుగు సహా అన్నీ భాషల్లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్నాయి.

ముగ్గురు స్టార్స్ విడుద‌ల చేసిన ‘పెంగ్విన్’ ట్రైల‌ర్‌

‘మహానటి’తో జాతీయ అవార్డుని దక్కించుకున్న కీర్తిసురేశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పెంగ్విన్’.

సుజిత్ ఎంగేజ్‌మెంట్

క‌రోనా టైమ్‌లో పెళ్లిళ్లు, ఫంక్ష‌న్స్ కొన్నాళ్ల పాటు ఆగాయి. అయితే దిల్‌రాజు, నిఖిల్ వంటి వారు క‌రోనా నిబంధ‌న‌ల మేర‌కు పెళ్లి చేసుకున్నారు.