close
Choose your channels

ప్రియమణి బ్లాక్ ఆంటీ అని హేళనకు గురైన వేళ..

Monday, June 14, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రియమణి బ్లాక్ ఆంటీ అని హేళనకు గురైన వేళ..

ప్రియమణి టాలీవుడ్ లో తన నటన, గ్లామర్ తో మెరుపులు మెరిపించింది. కేవలం గ్లామర్ కు మాత్రమే అవకాశం ఉన్న చిత్రాల్లో కూడా ప్రియమణి తన అభినయంతో ఆకట్టుకుంది. వివాహం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతోంది ప్రియమణి.

ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరిస్ తో ప్రియమణి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రియమణి కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. విజయాలు, అపజయాలు చూసింది. ప్రియమణి ఫ్యామిలీ మ్యాన్ సక్సెస్ తర్వాత వరుస ఇంటర్వ్యూ లతో బిజీగా మారింది.

ఆ ఇంటర్వ్యూలో ప్రియమణి తనకు ఎదురైన బాడీ షేమింగ్ సంఘటనని వివరించింది. కొన్నేళ్ల క్రితం నేను బరువు పెరిగాను. ఆ సమయంలో దారుణంగా ట్రోలింగ్ కి గురయ్యాను. ఆన్లైన్ లో నన్ను ' బ్లాక్ ఆంటీ ' అని అబ్యూస్ చేశారు.

కొంతమంది ఫ్యాట్ ఎక్కువైంది అని కూడా కామెంట్స్ చేశారు. దీనితో కొంత మానసికంగా ఇబ్బంది పడ్డట్లు ప్రియమణి తెలిపింది.

కానీ ఇప్పుడు ప్రియమణి పై కామెంట్స్ తగ్గిపోయాయి. నెటిజన్లు ఆమెని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ప్రియమణి నారప్ప, విరాటపర్వం లాంటి చిత్రాల్లో నటిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.