వ్యాపార రంగంలోకి ప్రియాంక‌చోప్రా...

  • IndiaGlitz, [Thursday,October 04 2018]

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్లి అక్క‌డ కూడా న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో్యిన్ ప్రియాంక చోప్రా.. త‌ర్వ‌లోనే త‌న ప్రియుడు .. ప్ర‌ముఖ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను వివాహం చేసుకోనుంది. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారు క‌దా!! ప్రియాంక పెళ్లి ప‌నుల‌తో బిజీగా ఉంటుందిలే అనుకోవ‌చ్చు.

పెళ్లి ప‌నుల‌తో ఏమో కానీ.. ప్రియాంక మాత్రం.. వ్యాపారం రంగంలో అడుగుపెట్ట‌డానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. హీరోయిన్స్ కాబ‌ట్టి.. సినిమా రంగానికి సంబంధించిన కాస్ట్యూమ్సో లేక మరేదైనా ఫుడ్ బిజినెస్‌లోనో ప్రియాంక ఇన్‌వెస్ట‌ర్‌గా జాయిన్ అయ్యుంటుంద‌ని అనుకోవ‌చ్చు కానీ.

ప్రియాంక భిన్నంగా టెక్నిక‌ల్ రంగంలో రెండు కంపెనీల‌తో భాగ‌స్వామిగా మారింది. అందులో ఒక‌టి మ్యారేజ్ బ్యూరో త‌ర‌హా సంస్థ అయితే.. మ‌రొక‌టి విద్యావ్య‌వ‌స్థ‌కు సంబంధించిన సంస్థ కావ‌డం గ‌మ‌నార్హం.