'ఆర్ఎక్స్ 100'ను మించి 'రాజావిక్రమార్క' బ్లాక్‌బస్టర్ అవుతుంది - నిర్మాత '88' రామారెడ్డి

  • IndiaGlitz, [Friday,August 20 2021]

సినిమాలపై ప్యాషన్‌తో గ్రామీణ నేపథ్యం నుండి తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన నిర్మాతలు కొందరు ఉన్నారు. ఘనవిజయాలు అందుకున్నారు. ఈ బాటలో వస్తున్న నిర్మాత '88' రామారెడ్డి. యువ హీరో కార్తికేయ గుమ్మకొండతో ఆయన 'రాజా విక్రమార్క' సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆయనకు తొలి చిత్రమిది. ఈ శుక్రవారం (ఆగస్టు 20న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా '88' రామారెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇవీ...

హ్యాపీ బర్త్‌డే రామారెడ్డిగారు!

థాంక్యూ అండీ. థాంక్యూ! తొలిసారి మీడియా మిత్రుల ముందుకు రావడం సంతోషంగా ఉంది.

మీది ఏ ఊరు, నేపథ్యం ఏమిటి?

మాది తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలంలో గల కొంకుదురు గ్రామం. దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డిగారిది మా ఊరే. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు ఉన్నాయి.

వ్యాపారం నుంచి సినిమాల్లోకి ఎలా వచ్చారు?

వినోద్ రెడ్డిగారు అని ఓ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. ఆయనది మా ఊరు. సుమారు రెండొందల సినిమాల వరకూ డిస్ట్రిబ్యూషన్ చేశారు. కొన్ని సినిమాలు సొంతంగా విడుదల చేశారు. వినోద్ రెడ్డి నాకు ఫ్రెండ్. ఆయన ద్వారా సినిమాల్లోకి వచ్చాను. నిర్మాతగా 'రాజా విక్రమార్క' నా తొలి సినిమా.

'రాజా విక్రమార్క' ఎలా మొదలైంది?

సినిమా నిర్మించాలని అనుకుంటున్నప్పుడు... వినోద్ రెడ్డి దగ్గరకు 'రాజా విక్రమార్క' కథ వచ్చింది. ఆయనతో పరిచయం ఉండటంతో మాటల మధ్యలో ఈ కథ గురించి చెప్పారు. నాకు బాగా నచ్చింది. సినిమా చేయాలని ఉందని చెప్పాను. తర్వాత ఆదిరెడ్డిగారితో కలిసి సినిమా స్టార్ట్ చేశాం. అలా వినోద్ రెడ్డి దగ్గర నుండి మా దగ్గరకు సినిమా వచ్చింది.

సినిమా ఎలా ఉండబోతోంది?

ఇది యాక్షన్ ఎంటర్టైనర్. హీరో కార్తికేయ ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తారు. సినిమాలో వినోదం, ప్రేమ కూడా ఉంటాయి. ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్టైనర్ ప్యాకేజ్. '90 ఎంఎల్' చేస్తున్నప్పుడు హీరోగారితో పరిచయం ఏర్పడింది. ఆ సినిమా తర్వాత చేయాలని అనుకున్నాం.

More News

ఆగస్టు 27న 'సోని లివ్' ఓటీటీలో 'వివాహ భోజనంబు' స్ట్రీమింగ్

కమెడియన్ సత్య హీరోగా నటించిన "వివాహ భోజనంబు" సినిమా 'సోని లివ్' ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.

'జీ 5' ఒరిజినల్ మూవీ 'నెట్' టీజర్ విడుదల... అవికా గోర్ ఇంట్లో ఎవరున్నారు?

వివిధ భారతీయ భాషల్లో, వివిధ జానర్లలో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ముఖ్యంగా ఒరిజినల్ మూవీస్ అందిస్తూ...

మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్..

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా,

'సావిత్రి w/o సత్యమూర్తి' టీజర్ విడుదల

'దిస్ ఈజ్ సత్యం. క్లాస్ టచ్, మాస్ కటౌట్! ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు నాలాంటోడు' అని 'కేరింత' ఫేమ్ పార్వతీశం అంటున్నారు.

రెజీనా క‌సాండ్ర తాజా చిత్రం ‘నేనే నా’ షూటింగ్ పూర్తి

హీరోయిన్ రెజీనా కసాండ్ర లేటెస్ట్ మూవీ ‘నేనే నా’. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ సినీ ఇండ‌స్ట్రీ స‌హా ప్రేక్ష‌కులంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.