close
Choose your channels

బ్రేకింగ్: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్

Wednesday, October 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ్రేకింగ్: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టాలీవుడ్ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ని బెదిరించిన కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పోలీసులు బుధవారం సాయంత్రం బండ్లను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో వైసీపీ నేత పీవీపీ ఇంట్లో అర్ధరాత్రి గణేష్ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తన అనుచరులతో కలిసి పీవీపీని బెదిరించాడు.

ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నాడు బండ్ల గణేష్‌ను అరెస్ట్ చేశారు. కాగా.. 420, 448, 506 ఆర్/డబ్ల్యూ, ఐపీసీ సెక్షన్ 43 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్లను అరెస్ట్ చేసిన తర్వాత బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.