Bunny Vasu:రాజకీయాల్లోకి నిర్మాత బన్నీ వాసు.. జనసేన ప్రచారం విభాగం ఛైర్మన్‌గా నియామకం..

  • IndiaGlitz, [Friday,December 15 2023]

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో కాలు మోపాలని జనసేన గట్టి పట్టుదలతో ఉంది. అధికార వైసీపీని గద్దె దించేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వాసును జనసేన ప్రచార విభాగం ఛైర్మన్‌గా నియమించారు. స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం పవన్ మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీలో అయినా ప్రచార విభాగం చాలా ముఖ్యమని.. పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేది ప్రచారమేనని తెలిపారు. జనసేన పార్టీ ఆశయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని సూచించారు. రాబోయేది ఎన్నికల ఏడాది కాబట్టి టీడీపీ-జనసేన నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని బన్నీ వాసును పవన్ ఆదేశించారు. దీంతో సినిమాలు తీస్తూ నిర్మాతగా బిజీగా ఉండే బన్నీ వాసు ఇకపై రాజకీయాల్లో కూడా బిజీ కానున్నారు.

కాగా జనసేనలోకి చేరికలు జోరందుకున్నాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి నేతలు జనసేనలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ కార్పొరేటర్ మహ్మద్ సాధిక్‌తో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన గరికపాటి వెంకట్‌లకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. వైసీపీ విముక్త ఆంధ్రపదేశ్‌ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని మరోసారి స్పష్టంచేశారు. రాష్ట్రం బాగుపడాలంటే పదేళ్లు టీడీపీతో పొత్తు అవసరమని పవన్ వెల్లడించారు.

More News

Pawan Kalyan:ఒక్కసారి జనసేనను నమ్మండి.. ప్రజలకు పవన్ కల్యాణ్‌ విజ్ఞప్తి

ఒక్కసారి జనసేనకు అవకాశం ఇవ్వండని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ఒక్కసారి మాటిస్తే వెనక్కి వెళ్లనని

YS Jagan: వాళ్లది ఒక్కటే ఏడుపు.. చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ విమర్శలు..

మీ బిడ్డ ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఒక్కటే ఏడుస్తు్‌న్నారని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్మించిన డా.వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్

Chadrababu: 150 సీట్లలో అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలవదు.. చంద్రబాబు ఎద్దేవా

మూడు నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల సీఎం జగన్ 11 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లను మార్చడంపై

SSC & Inter Exams: ఏపీలో పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

ఏపీలో పది, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి నెలలో పరీక్షలు నిర్వహించబోతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Times Now Survey: టైమ్స్‌నౌ సర్వేలో వైసీపీ ప్రభంజనం.. ఫ్యాన్ గాలికి టీడీపీ హుష్‌ కాకి..

ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని టైమ్స్‌ నౌ నవజీవన్, ఈటీజీ సర్వేలో తేలింది.