close
Choose your channels

‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ రిలీజ్ గురించి నిర్మాత క్లారిటీ

Friday, May 15, 2020 • తెలుగు Comments

‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ రిలీజ్ గురించి నిర్మాత క్లారిటీ

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1’. ఈ సినిమా రెండో పార్టుగా ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ సెట్స్‌పై ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2 చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే కేజీయ‌ప్ రెండో పార్ట్ అక్టోబ‌ర్ 23న విడుదల కావాల్సింది. కానీ ఇప్పుడు క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల వాయిదా ప‌డేలా ఉంది.

ఈ త‌రుణంలో నిర్మాత కిషోర్ గౌడ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని తెలియ‌జేశారు. సినిమా చిత్రీక‌ర‌ణ‌కు 30 రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. రెండు యాక్ష‌న్ ఎపిసోడ్స్ మిన‌హా దాదాపు చిత్రీకర‌ణంతా పూర్త‌య్యింద‌ట‌. ఇప్ప‌టికే యూనిట్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులపై ఫోక‌స్‌గా ఉంద‌ట‌. క‌నీసం జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం అనుమ‌తినిస్తే అనుకున్న‌ట్లుగానే అక్టోబ‌ర్ 23నే సినిమాను విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత అంటున్నారు. మ‌రి నిర్మాతకు ప్ర‌భుత్వం జూన్‌లో అనుమ‌తి ఇస్తే.. సినిమా విడుద‌ల్లో జాప్యం జ‌రిగే అవ‌కాశం లేన‌ట్లే. పార్ట్ 1 స‌క్సెస్ త‌ర్వాత పార్ట్ 2ను మరింత భారీగా నిర్మిస్తున్నారు. సంజ‌య్ ద‌త్, ర‌వీనాటాండ‌న్ వంటి తార‌లు ఇందులో న‌టిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz