'ఆర్ఆర్ఆర్‌' విడుద‌ల‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌

రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌ ప్రెస్టీజియ‌స్ మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం’. ఇప్ప‌టికే 75 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఈ ఏడాది జూలై 30న విడుద‌ల కావాల్సింది. అయితే ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్‌కు గాయాలు కావ‌డంతో గ్యాప్ వ‌చ్చింది. దాంతో మేకింగ్‌లో కాంప్ర‌మైజ్ కానీ జ‌క్క‌న్న సినిమా విడుద‌లను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న చేయాల‌నుకున్నాడు. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో షూటింగ్ ఆగింది. దీంతో సినిమా విడుద‌ల మ‌రోసారి వాయిదా ప‌డుతుందంటూ వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే రీసెంట్‌గా విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌లో అలాంటిదేం లేద‌ని జ‌క్క‌న్న పోస్ట‌ర్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. కానీ సినిమా విడుద‌ల పోస్ట్ పోన్ అవుతుందంటూ వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి.

అయితే ఈ వార్త‌ల‌ను నిర్మాత డి.వి.వి.దాన‌య్య ఖండించారు. సినిమాను అనుకున్న‌ట్లుగానే జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేస్తామ‌ని దాన‌య్య క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అందుకు కార‌ణాలు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌టి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ స‌హా అజ‌య్ దేవ‌గ‌ణ్, ఆలియా భ‌ట్‌వంటి బాలీవుడ్ తార‌లు.. ఒలివియా మోరిస్‌, రేస్టీవెన్ స‌న్, అలిస‌న్ డూడీ వంటి హాలీవుడ్ తార‌లు ఈ చిత్రంలో న‌టిస్తుండం మ‌రో కార‌ణం.

More News

అమ్మ‌డుకి ప‌వ‌ర్ ఫుల్ స్పెష‌ల్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ను ‘వ‌కీల్‌సాబ్‌’గా

బుట్ట‌బొమ్మ స‌రికొత్త రికార్డ్‌

ఈ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లోని పాట‌ల్లో అల వైకుంఠ పుర‌ములో సాంగ్స్‌కు వ‌చ్చినంత రెస్పాన్స్ మ‌రే సినిమాకు రాలేదు. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన

చిరు, నాగ్‌ల‌కు మోదీ ప్ర‌శంస‌...

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంతా లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచించారు. ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంది.

కార్తీకేయ 2 కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్న నిఖిల్ సిద్ధార్థ్

యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, యంగ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కార్తీకేయ 2. వ‌రుస హిట్ సినిమాలు రూపొందిస్తున్న

సాంగ్‌తో షురూ చేయ‌నున్న ఆలియా భ‌ట్‌

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న