close
Choose your channels

అంజలిని ఆ హీరో చెడగొట్టాడు..: నిర్మాత షాకింగ్ కామెంట్స్

Friday, November 22, 2019 • తెలుగు Comments

అంజలిని ఆ హీరో చెడగొట్టాడు..: నిర్మాత షాకింగ్ కామెంట్స్

అవును మీరు వింటున్నది నిజమే.. ఒకప్పుడు అటు టాలీవుడ్‌లో.. ఇటు కోలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన అంజలిని ఓ హీరో చెడగొట్టాడు.. ఇవేం రూమర్స్ కాదు.. కావాలనే పనిగట్టుకుని రాస్తున్న వార్త అస్సలే కాదు. ఈ విషయాలన్నీ కోలీవుడ్‌కు చెందిన నిర్మాత నందకుమార్ నోటి నుంచి వచ్చి నగ్న సత్యాలు. అసలు ఆ హీరో ఎవరు..? అసలేం జరిగింది..? ఈ నిర్మాత ఎందుకిలా చెబుతున్నాడు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇదిగో.. అంజలిని చెడగొడుతున్నది మరెవరో కాదంట.. ప్రముఖ తమిళ నటుడు జై.. అని నందకుమార్ చెబుతున్నాడు. అంజలి, జై నటీనటులుగా ‘బెలూన్’ అనే చిత్రంలో నటించిన విషయం విదితమే. కాగా ఈ సినిమాకు నందకుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సమయంలో అంజలి, జైకి సంబంధించిన వివాదాస్పద ఘటన గురించి తాజాగా నందకుమార్ మీడియా ద్వారా వెల్లడించి ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు. హీరో జై ను చీకొట్టిన ఆయన.. అంజలిని ఆకాశానికెత్తేశారు. నిజంగా ఆ అమ్మాయి చాలా మంచిదంటూ చెప్పుకొచ్చాడు.

జై జీవితంలోకి రావడంతో..!

‘జై వల్ల నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నాను. జై, అంజలితో ‘బెలూన్’ సినిమాను నిర్మించాను. అంజలి చాలా మంది అమ్మాయి. ప్రొఫెషనల్‌ పరంగా చాలా కచ్చితంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ‘జై’ ఆమె జీవితంలోకి వచ్చాడో అంజలి చెడిపోయింది. బెలూన్ సినిమా షూటింగ్ సమయంలో జై మాటిమాటికీ షూటింగ్ డిస్టర్బ్ చేసేవాడు. ఓసారి కొడైకెనాల్‌లో షూటింగ్‌కి వెళ్లాం. షాట్ రెడీ అవడంతో డైరెక్టర్ అంజలికి ఫోన్ చేసి సెట్‌లోకి రమ్మన్నాడు. అయితే అతను అంజలిని మేడమ్ అని పిలవలేదని జై ఓవరాక్షన్ చేశాడు. మేడమ్ అని పిలవనందుకు అంజలి బాధపడలేదు. కానీ జై రెచ్చిపోయాడు. ఇలాగైతే షూటింగ్ ఆపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత రోజున అంజలి సెట్‌కి రాకపోవడంతో చాలా సార్లు ఫోన్ చేశాం. కడుపు నొప్పి వచ్చిందని అంజలి ఫోన్ చేసింది. దాంతో మేం కంగారుపడి వెంటనే కారు పంపించాం. కానీ అది అంజలి చేత జై ఆడించిన నాటకం అని ఆ తర్వాత తెలిసింది’ అని నిర్మాత చెప్పుకొచ్చాడు.

తీరా చూస్తే...!

‘అయితే మేం పంపిన కారులోనే జై అంజలిని ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి చెన్నై తీసుకెళ్లిపోయాడు. దాంతో చేసేదేమీ లేక షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. అంతేకాదు కొడైకెనాల్‌లో అంజలి, జై కోసం ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో సపరేట్‌గా రెండు గదులు బుక్ చేశాం. కానీ అంజలి, జై ఒకే గదిలో ఉండేవారు. దాంతో మరో గదిని క్యాన్సిల్ చేయమని చెప్పాం. ఇందుకు జై ఒప్పుకోలేదు. ఆ గది రెంట్ రోజుకి 12 వేల రూపాయలు. ఈ సంఘటనల తర్వాత ఇంకెప్పుడూ జై లాంటి వ్యక్తితో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాను. అతను మంచి అమ్మాయి అయిన అంజలిని కూడా చెడగొట్టేశాడు’ అని జై గురించి నగ్న సత్యాలు నిర్మాత వెల్లడించాడు.

ప్రస్తుతం నందకుమార్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. ఇంత హడావుడి జరుగుతున్నా.. అటు జై గానీ.. ఇటు అంజలీ గానీ రియాక్ట్ అవ్వలేదు. మరి మౌనానికి అర్థం అంగీకారమేనా లేకుంటే ఏమైనా రియాక్షన్ ఉంటుందా అనేది తెలియాలంటే మరికొంత సమయం పడుతుందేమో.

Get Breaking News Alerts From IndiaGlitz