close
Choose your channels

ఆస్కార్ మూవీకి కోర్టు నోటీసులివ్వాలంనుకుంటున్న నిర్మాత‌

Sunday, February 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆస్కార్ మూవీకి కోర్టు నోటీసులివ్వాలంనుకుంటున్న నిర్మాత‌

రీసెంట్‌గా అనౌన్స్ చేసిన ఆస్కార్ అవార్డ్స్‌లో ద‌క్షిణ కొరియా చిత్రం `పార‌సైట్‌`కు ఏకంగా నాలుగు అవార్డులు ద‌క్కాయి. ఉత్త‌మ‌చిత్రం, డైరెక్ట‌ర్‌, విదేశీచిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఈ చిత్రం అవార్డుల ద‌క్కించుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. దీంతో ఈ సినిమా క‌థాంశం గురించి పెద్ద చ‌ర్చే జ‌రిగింది. అయితే కొంత మంది మాత్రం ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావ‌డంపై పెద‌వి విరిచారు. కోలీవుడ్ సినీ అభిమానులైతే పార‌సైట్ సినిమా కాన్సెప్ట్ త‌మిళ చిత్రానిదేన‌ని అంటున్నారు.

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ కెరీర్ ప్రారంభంలో `మిన్‌సార క‌న్నా` అనే సినిమాలో న‌టించాడు. ఈ చిత్రాన్ని కె.ఎస్‌.ర‌వికుమార్ తెర‌కెక్కించాడు. ఈ సినిమా నిర్మాత తేనప్ప‌న్ ఇప్పుడు `పార‌సైట్` సినిమాపై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ని, ఓ ఇంటర్నేష‌న‌ల్ న్యాయ‌వాదితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే ఓ ఆస్కార్ సినిమాకు కాపీ సినిమా అనే ఆరోప‌ణ‌లు రావ‌డం శోచ‌నీయం. అయితే మ‌రి ఈ కాపీ ఆరోప‌ణ‌లు ఎంత వ‌ర‌కు వెళ‌తాయో చూడాలి. పార‌సైట్ చిత్రాన్ని బొంగ్ జున్ హో తెర‌కెక్కించాడు. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ విదేశీ చిత్రంగా ఆస్కార్ గెలుచుకున్న తొలి చిత్రంగా పార‌సైట్ రికార్డ్‌కెక్కింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.