close
Choose your channels

‘గుణ 369’ స్టోరీని సింగిల్‌ లైన్‌లో చెప్పేసిన నిర్మాతలు!

Saturday, July 27, 2019 • తెలుగు Comments

‘గుణ 369’ స్టోరీని సింగిల్‌ లైన్‌లో చెప్పేసిన నిర్మాతలు!

కార్తికేయ, అనఘా నటీనటులుగా అర్జున్ జంధ్యాల తెరకెక్కించిన చిత్రం ‘గుణ 369’. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన చిత్రంలో కార్తికేయ సరికొత్త లుక్‌లో కనిపించి మరో సక్సెస్‌ను తన ఖాతాలోకి వేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ‘గుణ 369’ ఆగస్ట్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. శనివారం నాడు నిర్మాతలు శ్రీమతి ప్రవీణ కడియాల, తిరుమల్‌ రెడ్డి, అనిల్‌ కడియాల మీడియాతో ముచ్చటించి సినిమా గురించి.. వీరి ఫ్యూచర్స్ ప్రాజెక్ట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడం జరిగింది. కాగా.. టెలివిజన్‌ రంగంలో ‘స్ప్రింట్‌ మీడియా’, ‘జ్ఞాపిక ఎంటర్‌ ప్రైజస్‌’ ఈ పేర్లు ప్రత్యేకించి మరి పరిచయం చేయనక్కర్లేదు. వీరిద్దరూ సంయుక్తంగా శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో ‘గుణ 369’ వస్తోంది.

‘గుణ 369’ స్క్రిప్ట్ గురించి..!

"మంచి సబ్జెక్ట్‌ దొరికితే సినిమా రంగంలోకి రావాలని గత రెండు సంవత్సరాలు నుంచి వేచి చూస్తున్నాం. సరిగ్గా ఇదే టైమ్‌లో అర్జున్‌ జంధ్యాల ఒక మంచి స్క్రిప్ట్‌తో మమ్మల్ని సంప్రదించారు. యదార్థ సంఘటలు, ప్రేరణతో కూడిన ఒక మంచి కథ కావడంతో మాకు బాగా నచ్చింది. బుల్లితెర నుంచి వెండితెరకు మేము నిర్మాతలుగా పరిచయమవడానికి ఇది మంచి కథ అనిపించి ఓకే చెప్పేశాం. టెలివిజన్‌ రంగంలో ఒక స్థాయిలో నిలబడ్డామో.. అదే విధంగా సినిమా రంగంలో కూడా అలానే నిలబడాలనే కాన్ఫిడెంట్‌తో రావడం జరిగింది. ఆ వచ్చే క్రమంలో కొన్ని స్టోరీస్‌ విని వాటిలో ‘గుణ 369’ బాగుందని కథ విని ఫైనల్ చేసేశాం.

సినిమా కథ ఇదీ.. డైరెక్టర్ గురించి!

స్టోరీ సింగిల్‌ లైన్‌లో..: తన కొడుకు పేరు కింద బీటెక్‌ అని పేరు పెట్టుకోవాలనే ఒక తండ్రి కోరిక టోటల్‌గా రివర్స్‌ అయ్యి అతనికి ‘369’ అనే ఖైదీ నెంబర్‌ వస్తే, అలాగే సరదాగా మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలిలో పుట్టి.. ఒక అందమైన అమ్మాయితో ప్రేమలో ఉండే వ్యక్తి ఖైదీగా ఎందుకు మారాడు? అనేది మెయిన్‌ పాయింట్‌.

కథలో స్పెషాలిటీ ఏంటనే విషయానికొస్తే..:

ఈ సినిమాలో మిమ్మల్ని మీరు చూసుకుంటారు. డబ్బు ఉంటేనే అన్ని ఆనందాలు ఉంటాయి అనుకునే వారికి .. మనకు బ్రతకడానికి సరిపడాడబ్బు ఉండి, అమ్మ, సోదరిప్రేమతో ఆ కుటుంబం ఎలా సంతోషంగా ఉండి అనడానికి మా సినిమా ఒక ఉదాహరణ. గుణ లాంటి అబ్బాయి నా కొడుకు అయితే ఎంత బాగుంటది అని ప్రతి తండ్రి అనుకునేలా సినిమా ఉంటుంది. అలాగే ఆడపిల్లలను ఎలా గౌరవించాలో తెలిపే మెయిన్‌ పాయింట్‌ మా సినిమాలో ఉంది. అందుకని తప్పకుండా అందరి ఆడియన్స్‌కి మన సినిమా దగ్గరవుతుంది.

డైరెక్టర్ గురించి..:

మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంది. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో అర్జున్ పనిచేశాడు. ఆయనకు 24 క్రాఫ్ట్స్‌ మీద మంచి గ్రిప్‌ ఉంది. అందుకే మాకు కథ ఎలా చెప్పారో.. అలాగే డైరెక్ట్ చేశాడు. ఇండస్ట్రీ నుండి మంచి సపోర్ట్‌ లభించింది.

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ..

మంచి కథలు వింటున్నాం. కథ దొరికితే మేము ఇద్దరం కలిసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మణిరత్నం గారి దగ్గర పని చేసిన కిరణ్‌ ఒక స్టోరీ వినిపించడం జరిగింది. ఇంకా కొంచెం డెవలప్‌ చేయమన్నాం. అవ్వగానే మా నెక్స్ట్‌ మూవీ అతనితో ఉంటుంది అని నిర్మాతలు శ్రీమతి ప్రవీణ కడియాల, తిరుమల్‌ రెడ్డి, అనిల్‌ కడియాల మీడియాతో చెప్పుకొచ్చారు.

బుల్లితెరను ఏలి.. వెండితెరను ఏలడానికి వస్తున్న ఈ నిర్మాతలు ఇక్కడ సక్సెస్ కావాలని ఆశిస్తూ మీరు మెచ్చే.. ఎందరో ఆదరాభిమానాలు పొందిన.. పొందుతున్న www.indiaglitz.com ఆల్ ది బెస్ట్ చెబుతోంది.

Get Breaking News Alerts From IndiaGlitz