అది చూసి సీఎం కేసీఆర్ కూడా బాధపడాలి: నాగేశ్వర్

  • IndiaGlitz, [Thursday,April 25 2019]

రెవెన్యూ శాఖలో అవినీతి ఉందంటే అది చూస్తున్న గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బాధపడాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. గురువారం నాడు నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెవెన్యూ శాఖలో సంస్కరణలపై రెవెన్యూ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉద్యోగులు, వివిధ రంగాల మేథావులు హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్.. కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతి నిర్మూలన అనేది రాజకీయ అవినీతి నుంచే ప్రారంభం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ అవినీతిని ముఖ్యమంత్రే అంతం చేయాలన్నారు.

ఉద్యోగులపై నెపం నెట్టే ప్రయత్నం సరికాదు..!

కేసీఆర్ తిట్టకముందు రెవెన్యూ అధికారుల మీటింగ్ పెట్టి ఉంటే బాగుండేది. వ్యవస్థ మారనంత కాలం రాజకీయ నాయకులు అధికారులపై పెత్తనం చేస్తూనే ఉంటారు. ఉద్యోగుల పని సంస్కృతి మారక పోతే ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు మమ్మల్ని మేము సంస్కరించుకుంటాము అనే సందేశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అవినీతి రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు అవినీతి న్యాయవాది, పోలీసు, జర్నలిస్టు ఉంటాడు. మొత్తం వ్యవస్థను బలి చేస్తే.. ప్రభుత్వ మనుగడ కష్టం. ప్రజలకు, ఉద్యోగులకు ఘర్షణ వస్తే ప్రభుత్వానికి కష్టం. దేశంలో రాజకీయ అవినీతి అంతం కాకుండా ఉద్యోగుల అవినీతి నిర్ములన అసాధ్యం.

అవినీతి నిర్మూలన అనేది రాజకీయ అవినీతి నుంచే ప్రారంభం కావాలి. దాన్ని తొలగించకుండా ఉద్యోగులపై నెపం నెట్టే ప్రయత్నం సరికాదు. ఉద్యోగులపై దాడి మొదలైతే అది అక్కడితో ఆగదు.. ప్రభుత్వానికి మంచిది కాదు. వ్యవస్థ అవినీతిని సృష్టిస్తుందా? అవినీతిపరున్ని సృష్టిస్తుందా?.. అవినీతి ఆగాలంటే వ్యక్తిగత నిజాయితీ, వ్యక్తిగత హితబోధ జరగాలి. వ్యవస్థలు ఉద్యోగులను అవినీతి పరులను చేస్తాయి.ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చట్టాలు చేసే అధికారం ఉంటుంది. చట్టాన్ని ఉద్యోగులుగా మనం ప్రశ్నించలేము అని ప్రొ. నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

 

 

More News

ఆ ఫోన్ తెచ్చిస్తే రూ. 4 లక్షలిస్తాం.. హానర్ కంపెనీ బంపరాఫర్!

అవును మీరు వింటున్నది నిజమే.. ఇదేంట్రా బాబు మహా అంటే ఆ ఫోన్ విలువ ఏ పాతికో ఉంటుందంతేగా కొత్త ఫోన్ కొనుక్కోకుండా నాలుగు లక్షలు ఇవ్వడమేంటని కాస్త ఆశ్చర్యంగా ఉన్నా..

లాభాలతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత వారం రోజులుగా పెద్దగా లాభాలతో ప్రారంభం, ముగియని స్టాక్ మార్కెట్స్..

'కాంచన-3' హీరోయిన్‌కు లైంగిక వేధింపులు.. నటుడు అరెస్ట్

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన హారర్ చిత్రం ‘కాంచన-3’. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

మహేశ్ మూవీలో యాక్టింగ్‌కు 'రాములమ్మ' కోటిన్నర డిమాండ్!

సూపర్ స్టార్‌ మహేశ్ బాబు త్వరలో అనిల్ రావుపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'గీత గోవిందం' మూవీ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా..

'అర్జున్ సుర‌వ‌రం' మ‌రోసారి వాయిదా

నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా టి.ఎన్‌.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `అర్జున్ సుర‌వరం`. యంగ్ జ‌ర్న‌లిస్ట్ స‌మాజంలో జ‌రుగుతున్న ఓ పెద్ద స‌మ‌స్య‌పై ఎలా పోరాడ‌డ‌నే క‌థ‌తో రూపొందిన చిత్ర‌మిది.