close
Choose your channels

బాలయ్యపై ఓడిన అభ్యర్థికి వైసీపీలో విశిష్ట స్థానం.. వాళ్లకు షాక్!

Monday, August 12, 2019 • తెలుగు Comments

బాలయ్యపై ఓడిన అభ్యర్థికి వైసీపీలో విశిష్ట స్థానం.. వాళ్లకు షాక్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించిన సీట్లు ఎక్కువగానే దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన వైసీపీ కొన్ని కీలక స్థానాల్లో ఓడిపోయింది. ముఖ్యంగా హిందూపురంలో నందమూరి బాలకృష్ణను ఓడించాలని వైసీపీ సాయశక్తులా ప్రయత్నాలు చేసింది. అయితే ప్రత్యర్థి పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ బాలయ్య రెండోసారి గెలిచి నిలిచారు. ఇదివరకు అంటే 2014లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి అయితే కచ్చితంగా గెలిచేవారని.. ముక్కూ మొహం తెలియని మాజీ ఐపీఎస్ ఇక్బాల్‌‌ను బరిలోకి దిపండంతో అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు...
అయితే.. బాలయ్యపై ఓడిన ఇక్బాల్‌ పార్టీలో విశిష్ట స్థానాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు స్థానాల్లో జరిగే ఈ ఎన్నికలకు గాను వైసీపీ అభ్యర్థులను ఫిక్స్ చేసింది. వారిలో ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్‌, కర్నూలు జిల్లా సీనియర్‌ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. పార్టీ అధిష్టానంతో చర్చించిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

ముగ్గురుదీ గెలుపే..!
ఇదిలా ఉంటే.. ఈ నెల 14వ తేదీతో ఎన్నికల నామినేషన్‌కు గడువు ముగియనుంది. ఈ అభ్యర్థులందరూ ఈ నెల 13 లేదా 14వ తేదీన నామినేషన్‌ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా.. మండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలూ ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవే కావడం వైసీపీకి ప్లస్ పాయింటే. దీంతో ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే మూడు స్థానాలూ వైసీపీ ఖాతాలోకే రావడం పక్కా అని తెలుస్తోంది. అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సంఖ్యా బలం లేకపోవడంతో మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తానికి చూస్తే ముగ్గరు ఎమ్మెల్సీలుగా ఎన్నికవ్వడం పక్కా అని తెలుస్తోంది.

వీళ్లందరికీ షాకింగ్..!

ఇదిలా ఉంటే మొదట్నుంచి ఈ ఎమ్మెల్సీ రేసులో కడప జిల్లా రాజంపేటకు చెందిన ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం రెడ్ సిగ్నల్ ఇచ్చి.. ఈయనకు బదులుగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మేడా మల్లిఖార్జున రెడ్డికి టికెట్ దక్కింది. అయితే అప్పట్లో ఆకేపాటికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తారని భావించారు. అయితే తాజా ప్రకటనతో ఆకేపాటి, ఆయన అభిమానులు కన్నెర్రజేస్తున్నారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మర్రి రాజశేఖర్ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. అయితే ఈయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం గమనార్హం. వాస్తవానికి ఈ నియోజకవర్గం మర్రిదే.. అయితే విడదల రజనీ రగంలోకి దిగడంతో మర్రిని కాదని ఆమెకే అధిష్టానం టికెట్ ఇచ్చింది. అప్పట్లో ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రిని కూడా చేస్తానని వైఎస్ జగన్ బహిరంగ సభలోనే స్పష్టం చేసిన విషయం విదితమే.

ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దదే ఉంది. అయితే వీరందర్నీ కాదని.. బాలయ్యపై పోటీ చేయడానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాటు.. ఆయన ఓడితే మళ్లీ ఎమ్మెల్సీని చేయడంపై ఇంతవరకూ ఇదే స్థానం నుంచి వరుసగా నాలుగుసార్లు పోటీ చేసి ఓడిన వైసీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్‌ను అధిష్టానం మరిచిపోవడం గమనార్హం. అయితే అసంతృప్తులకు వైఎస్ జగన్ ఎలాంటి స్థానం కల్పిస్తారో.. వారిని ఏ మాత్రం సంతృప్తిపరుస్తారో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz