పృథ్వీ, నవీన్ చంద్ర హీరోలుగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నవంబర్ లో విడుదల

  • IndiaGlitz, [Saturday,October 29 2016]

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నిర్మిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్‌ పూర్తయింది. నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. వసంత్‌ చేసిన మ్యూజిక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది'' అన్నారు.
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా సలోని, శృతి సోధి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్‌: గౌతమ్‌రాజు, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

More News

కత్తి పట్టుకుని రికార్డ్ ల మీదకు బాలయ్య దండయాత్ర..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

మహేష్ బాబు బ్రహ్మోత్సవం ప్లాప్ తో నేను నేర్చుకున్నది అదే..! నిర్మాత పి.వి.పి

బలుపు, విశ్వరూపం, సైజ్ జీరో, క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం...ఇలా విభిన్న కథా చిత్రాలను నిర్మించిన భారీ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా. ఈ భారీ నిర్మాణ సంస్థ తాజాగా నిర్మించిన చిత్రం కాష్మోరా. కార్తి, నయనతార, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా నటించిన కాష్మోరా చిత్రాన్ని గోకుల్ తెరకెక్కించారు.

17న వస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా'

శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'జయమ్ము నిశ్చయమ్మురా'.

చిరు ఖైదీ నెం150 ఫస్ట్ లుక్ రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టేజియస్ ఫిల్మ్ ఖైదీ నెం 150.ఈ చిత్రాన్ని డైనమిక్ డైరెక్టర్ వినాయక్ తెరకెక్కిస్తున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి బిజినెస్ డీటైల్స్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.