గ‌రుడ‌వేగ ఆర్టిస్ట్‌.. షార్ట్ ఫిల్మ్‌

  • IndiaGlitz, [Tuesday,November 28 2017]

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు యువ న‌టుడు ఆదర్శ్ బాలకృష్ణ. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'లో రన్నర్ అప్ గా నిలిచాడు ఆద‌ర్శ్‌. అంతేకాకుండా.. ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు డా. రాజశేఖర్ చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ నందుకున్న 'పి.ఎస్.వి.గరుడవేగ 126.18ఎం' సినిమాలో కూడా ఒక చిన్న రోల్ ప్లే చేసాడు ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌.

ఇదిలా ఉంటే.. 'కర్మ గేమ్స్' అనే షార్ట్ ఫిలింలో న‌టించాడు ఈ యువ న‌టుడు. అంతేకాకుండా.. దీనికి త‌నే స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ షార్ట్ ఫిలిం రచయిత కూడా ఆదర్శ్ కావడం విశేషం.

తన యాక్టింగ్ స్కూల్ మేట్ జిష్ణు రాఘవన్ తో కలిసి ఈ షార్ట్ ఫిలింని రెడీ చేసాడు ఆదర్శ్. దీనికి సంబంధించిన ట్రైలర్ ని కూడా తాజాగా ట్విట్టర్ ద్వారా విడుదల చేసాడు. ఈ షార్ట్ ఫిలింని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు ఆదర్శ్. ఆద‌ర్శ్ త‌న క్రియేటివిటీతో ఏ మాత్రం ఆక‌ట్టుకుంటాడో చూడాలి.