close
Choose your channels

'త‌లైవి' లో శోభ‌న్‌బాబుగా సైకిక్ విల‌న్‌?

Monday, February 17, 2020 • తెలుగు Comments

త‌లైవి లో శోభ‌న్‌బాబుగా సైకిక్ విల‌న్‌?

ఇటీవ‌ల నాగ‌శౌర్య హీరోగా న‌టించిన `అశ్వ‌థ్థామ` చిత్రంలో బెంగాలీ న‌టుడు జిస్సు సేన్ గుప్తా సైకిక్ విల‌న్‌గా న‌టించి త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈయ‌న‌కు మ‌రో అద్భుత‌మైన పాత్ర ద‌క్కింద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ఆ పాత్ర ఏదో కాదు.. శోభ‌న్‌బాబు. ఒక‌ప్పుడు లేడీ ఫేవ‌రేట్ హీరోగా, అంద‌గాడుగా పేరు సంపాదించుకున్న హీరో శోభ‌న్‌బాబు పాత్ర జ‌య‌ల‌లిత జీవితంలో చాలా ప్రాముఖ్య‌తను ద‌క్కించుకుంది. వీరి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డిచింద‌ని ఊహాగానాలు కూడా ఉన్నాయి.

ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని త‌లైవి సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్  పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద స్వామి న‌టిస్తుండ‌గా మ‌రో దివంగ‌త నేత క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌టిస్తున్నారు. కాగా.. శోభ‌న్‌బాబు పాత్ర‌లో జిస్సు సేన్ గుప్తా న‌టిస్తున్నార‌ని టాక్‌. అయితే ఆయ‌న పాత్ర నిడివి ఎంత ఉంటుంద‌నే తెలియాలంటే విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz