'త‌లైవి' లో శోభ‌న్‌బాబుగా సైకిక్ విల‌న్‌?

  • IndiaGlitz, [Monday,February 17 2020]

ఇటీవ‌ల నాగ‌శౌర్య హీరోగా న‌టించిన 'అశ్వ‌థ్థామ' చిత్రంలో బెంగాలీ న‌టుడు జిస్సు సేన్ గుప్తా సైకిక్ విల‌న్‌గా న‌టించి త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈయ‌న‌కు మ‌రో అద్భుత‌మైన పాత్ర ద‌క్కింద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ఆ పాత్ర ఏదో కాదు.. శోభ‌న్‌బాబు. ఒక‌ప్పుడు లేడీ ఫేవ‌రేట్ హీరోగా, అంద‌గాడుగా పేరు సంపాదించుకున్న హీరో శోభ‌న్‌బాబు పాత్ర జ‌య‌ల‌లిత జీవితంలో చాలా ప్రాముఖ్య‌తను ద‌క్కించుకుంది. వీరి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డిచింద‌ని ఊహాగానాలు కూడా ఉన్నాయి.

ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని త‌లైవి సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద స్వామి న‌టిస్తుండ‌గా మ‌రో దివంగ‌త నేత క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌టిస్తున్నారు. కాగా.. శోభ‌న్‌బాబు పాత్ర‌లో జిస్సు సేన్ గుప్తా న‌టిస్తున్నార‌ని టాక్‌. అయితే ఆయ‌న పాత్ర నిడివి ఎంత ఉంటుంద‌నే తెలియాలంటే విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

కేసీఆర్‌‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం నేడు. నేటితో కేసీఆర్ 66వ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు.

సుప్రీం దెబ్బతో 10వేల కోట్లు చెల్లించిన ఎయిర్‌టెల్‌

టెలికాం సంస్థలు కోట్లాది రూపాయిలు ప్రభుత్వానికి బకాయిపడ్డాయని.. ఇంతవరకూ చెల్లించలేదన్న వార్తలను మనం చాలా రోజులుగా వింటూనే ఉన్నాం.

మార్చి-3న నిర్భయ దోషులకు ఉరి..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అతి భయంకరమైన నిర్భయ కేసులో ఎట్టకేలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష ఖరారైపోయింది.

మ‌రో రీమేక్ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న చ‌ర‌ణ్‌

ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ రామ్‌చ‌ర‌ణ్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

‘సోది ఆపి.. దమ్ముంటే నన్ను ఆపు’ (‘V’ టీజర్ రివ్యూ)

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘V’ చిత్రం. ఇప్పటికే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను వదలింది.