close
Choose your channels

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ సర్కార్

Monday, February 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణలో సీఎం నారాయణస్వామి ప్రభుత్వం విఫలం అయ్యింది. సరైన సంఖ్యాబలం లేకపోవడంతో నారయణస్వామి విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. బలపరీక్ష కోసం పుదుచ్చేరి శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే ఈ తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందే నారాయణస్వామి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో విశ్వాసం వీగిపోయినట్టు స్పీకర్ శివకొలుందు వెల్లడించారు. సభ నుంచి నారాయణ స్వామి నేరుగా రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు వెళ్లారు.

అక్కడ ఎల్జీ తమిళసైని కలిసి తన రాజీనామాను అందజేసినట్టు నారాయణస్వామి తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, మరో ఎమ్మెల్యే ఉద్వాసనకు గురవడంతో ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం బలాన్ని నిరూపించుకోవాలసి వచ్చింది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌-డీఎంకే ప్రభుత్వానికి ఆదివారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 33 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వ బలం 11కు పడిపోయింది. తాజాగా రాజీనామా చేసిన వారిలో ఒకరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కాగా, మరొకరు భాగస్వామ్య పార్టీ డీఎంకే ఎమ్మెల్యే ఉన్నారు.

అంతకు ముందు సీఎం శాసనసభలో మాట్లాడుతూ.. డీఎంకే మద్దతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని.. ఆ తర్వాత కూడా ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్నామన్నారు. పుదుచ్చేరి ప్రజలకు తమపై నమ్మకం ఉందని ఆ ఎన్నికలు నిరూపించాయన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ ఎల్జీ కిరణ్ బేడీ, కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షంతో చేతులు కలిపిందన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలను కిరణ్ బేడీ అడ్డుకున్నారని నారాయణ స్వామి విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తాము ఎన్నో సార్లు నిధులు అడిగినప్పటికీ కేంద్ర మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.