close
Choose your channels

Puli Meka:100 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో జీ 5లో దూసుకెళ్తోన్నక్రైమ్ థ్రిల్లర్ ‘పులి మేక’

Friday, March 10, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాప్ మోస్ట్ డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ఇండియాలోనే త‌న‌దైన స్థానాన్ని, గుర్తింపును ద‌క్కించుకుంది జీ 5. తెలుగులో మాత్ర‌మే కాదు.. త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజరాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ అలరిస్తోంది. ప్రారంభం నుంచి ఆడియెన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ వారి హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌ను వేసుకుంది జీ 5 ఓటీటీ. పిక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ వారి కామెడీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్న‌పూర్ణ స్టూడియోస్ వారి లాస‌ర్ 2. బీబీసీ స్టూడియోస్‌, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన్‌మెంట్ కాంబోలో రూపొందిన గాలి వాన‌. ఇంకా రేసీ, హ‌లో వ‌రల్డ్‌, మా నీళ్ల ట్యాంక్‌, ఆహా నా పెళ్లంటతో పాటు రీసెంట్‌గా విడుద‌టైన ఏటీఎంతో పాటు పులి మేక కూడా ఆ వ‌రుస‌లో చేరి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఫిబ్ర‌వ‌రి 23 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది.

జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ క‌లిసి రూపొందించిన పులి మేక ఒరిజిన‌ల్‌లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, గ్లింప్స్ ఇలా ప్రారంభం నుంచే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సిరీస్ ఆడియెన్స్ మ‌న్న‌న‌లు పొందుతూ దూసుకెళ్తోంది. ఇప్ప‌టికే ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ 100 మిలియ‌న్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించి ఓటీటీ సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

స్మార్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా పులి మేక ఆడియెన్స్‌ను క‌ట్టి ప‌డేసింది. సిరీస్‌లో ఉండే ట్విస్టులు, ట‌ర్నుల‌ను ప్రేక్ష‌కులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ పాత్ర‌లు స‌హా ఎంటైర్ సిరీస్‌ను ఫ్యామిలీ అంతా క‌లిసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే గోప‌రాజు ర‌మ‌ణ, సిరి హన్మంత్‌, రాజా చెంబోలు, నోయెల్ సేన్ ఇలా ప్ర‌తీ పాత్ర‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇందులో సోష‌ల్ మెసేజ్ మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకుంటోంది.

పులి మేక ఒరిజిన‌ల్ ఇంత బాగా రావ‌టంలో షో ర‌న్న‌ర్‌గా, రైట‌ర్‌గా కోన వెంక‌ట్ త‌న‌దైన పాత్ర‌ను అద్భుతంగా పోషించారు. వ్యూయింగ్ నెంబ‌ర్స్ ద్వారా ప్రేక్ష‌కులు ఆయ‌న‌కు ప్ర‌శంస‌లను అందించారు.

న‌టీన‌టులు: కిర‌ణ్ ప్ర‌భ‌గా లావ‌ణ్య త్రిపాఠి, ప్ర‌భాక‌ర్ శ‌ర్మ‌గా ఆది సాయి కుమార్, అనురాగ్ నారాయ‌ణ్‌గా సుమన్‌, దివాక‌ర్ శ‌ర్మ‌గా గోప‌రాజు, క‌రుణాక‌ర్ శ‌ర్మగా రాజా, ప‌ల్ల‌విగా సిరి హన్మంత్, ఆది సాయికుమార్ అసిస్టెంట్ వెంకట్ పాత్రలో ముక్కు అవినాష్, పాండు రంగారావుగా శ్రీనివాస్, శ్వేతగా స్పందన పల్లి న‌టించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.