close
Choose your channels

టీటీడీ చైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డితో పురాణ‌పండ శ్రీనివాస్ ధార్మిక చ‌ర్చ‌లు

Friday, July 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీటీడీ చైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డితో పురాణ‌పండ శ్రీనివాస్ ధార్మిక చ‌ర్చ‌లు

భార‌తీయ వైదిక శాస్త్రాల సంప్ర‌దాయల ఆధారంగా విశేష ఆధ్యాత్మిక సాధ‌నా గ్రంథాల ర‌చ‌న‌లు, సంక‌ల‌నాలు అపురూపంగా శ్రీశైల దేవ‌స్థానం పూర్వ ప్ర‌త్యేక స‌ల‌హాదారులు పురాణ పండ శ్రీనివాస్ మంగ‌ళ‌వారం ఉద‌యం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డితో సుమారు అర‌గంట‌సేపు భేటీ అయ్యారు.

త‌ర‌త‌రాల విశ్వాసాలైన ఆర్ష ధార్మిక గ్రంథాల ర‌చ‌నా, రూప‌క‌ల్ప‌న‌లో ప్ర‌చుర‌ణ ప్ర‌చారోద్య‌మంలో తెలుగునాట అగ్ర‌శ్రేణిగా నిలిచిన పురాణ పండ శ్రీనివాస్ ఆధ్యాత్మిక సంస్థ `జ్ఞాన మ‌హాయ‌జ్ఞ‌కేంద్రం` చేస్తున్న నిర్విరామ కృష్ణిని, నిస్వార్థ సేవ‌ను ఈ సంద‌ర్భంలో సుబ్బారెడ్డి ప్ర‌శంసించారు.
ఈరోజుల్లో ఇంత విశిష్టంగా, వినూత్న భ‌రితంగా, విక‌స‌నాత్మ‌క దృష్టితో ధార్మిక గ్రంథాల‌ను ర‌చించి ప్ర‌చురించ‌డం సాహ‌సోపేత‌మ‌ని, అందులోనూ ప‌ర‌మాత్మ చైత‌న్యాన్ని శ్రీనివాస్ ఉచితంగా అందించ‌డం వెనుక తిరుమ‌ల శ్రీవారి కృప పుష్క‌లంగా ఉండ‌డ‌మేన‌ని సుబ్బారెడ్డి అభినందించారు. ఈ సంద‌ర్భంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌, ధ‌ర్మ ప్రచార ప‌రిష‌త్ కార్య‌క్ర‌మాల ప్ర‌చుర‌ణ‌ల విశేషాల్ని సుబ్బారెడ్డితో శ్రీనివాస్ ప్ర‌స్తావించారు.

వైసీపీ రాష్ట్ర నాయ‌కులు, శాస‌న‌స‌భ్యురాలు, ఏ.పి.ఐ.ఐ.సి ఛైర్మ‌న్ శ్రీమ‌తి రోజా ప్ర‌చురించిన పురాణ పండ శ్రీనివాస్ ర‌చ‌నా సంక‌ల‌నం `శ్రీపూర్ణిమ‌`, మ‌హాగ్రంథ వైభ‌వాన్నిమాత్ర‌మే కాకుండా వారాహి చ‌ల‌న చిత్రం అధినేత‌లు సాయి కొర్ర‌పాటి, శ్రీమ‌తి ర‌జ‌నీ కొర్ర‌పాటి స‌మ‌ర్ప‌ణ‌లో దేశంలో తొలిసారిగా శ్రీనివాస్ విడుద‌ల చేసిన ఆంజ‌నేయ స్వామి విశేష ఉపాస్య సంచిక `నేనున్నాను` గ్రంథాన్ని ఎంతో ఆస‌క్తిగా ప‌రిశీలించి సుబ్బారెడ్డి అభినందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.