హీరోయిన్లకు పెళ్లి, గర్భం అంటే పూరికి నచ్చదట!


Send us your feedback to audioarticles@vaarta.com


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రాక్టికల్ గా ఉండే వ్యక్తి. ఆయన ఆలోచనలు కాస్తంత భిన్నంగానే ఉంటాయి. ఎలాంటి విషయం అయినా స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడే వ్యక్తి పూరి. తాజాగా పూరి జగన్నాధ్ హీరోయిన్ల గురించి చెప్పిన విషయాలు గమ్మత్తుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: బిగ్ సర్ ప్రైజ్: ధనుష్, శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ!
హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే పూరి జగన్నాధ్ కు నచ్చదట. ఎందుకంటే హీరోయిన్లని తాము దేవతలుగా భావిస్తాం. మనుషులకు ప్రేమ పెళ్లి అవసరం.దేవతలకు ఎందుకు అని పూరి అంటున్నారు. దేవతాల్లాంటి హీరోయిన్లు మనుషుల తరహాలో పెళ్లి చేసుకుని గర్భంతో ఆసుపత్రిలో ఉంటే నేను తట్టుకోలేను.
కనీసం హీరోయిన్లు అయినా మగాళ్లకు దూరంగా ఉండాలి. సొంతంగా ఎదగాలి. జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి వీళ్లంతా మగాళ్ల అండ లేకుండా ఎదిగారు అని పూరి అన్నారు. ఇలాంటి వారిని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి అని పూరి అన్నారు.
స్వర్గంలో కూడా రంభ, ఊర్వశి, మేనక పెళ్లిళ్లు చేసుకోలేదు. కాబట్టే మనకు స్వర్గం అంటే అంత ఆసక్తి. ఒక వేళ వారు పెళ్లిళ్లు చేసుకుని గర్భంతో ఉంటే మనుషులు చచ్చి స్వర్గానికి వెళ్ళడానికి కూడా ఆసక్తి చూపారు అని పూరి ఫన్నీ కామెంట్స్ చేశారు.
సినిమాల విషయానికి వస్తే.. కొత్త హీరోయిన్లని పరిచయం చేయడంలో, వారిని అందంగా చూపించడంలో పూరి తర్వాతే ఎవరైనా. ప్రస్తుతం పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.


-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments