నీతో నువ్వు డాన్స్‌ చేయాలంటే....  :  పూరీ జగన్నాథ్‌

'ఫ్రెండ్‌షిప్‌ వేరు ఫ్రెండ్లీనెస్‌ వేరు' అని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా పూరి ఫ్రెండ్లీనెస్‌ గురించి మాట్లాడారు. దారిలో మీకొక కుక్కపిల్ల కనపడుతుంది. మిమ్మల్ని చూడగానే చాలా ప్రేమగా దగ్గరకొస్తుంది. మీరెవరో దానికి తెలియదు. అయినా మీ చుట్టూ నవ్వుతూ తిరుగుతుంది. కాసేపు దాంతో ఆడుకుని వెళ్లిపోతారు. మీరు తిరిగొచ్చేసరికి అది ఇంకేవరితోనో ఆడుకుంటూ ఉంటుంది. అదంటే అందరికీ ఇష్టం. నిమిషం తిరక్కుండానే అందరితో ఫ్రెండ్‌లా మారిపోతుందది. దాంతో ఐదు నిమిషాలున్న మీకు హాయిగా ఉంటుంది. ఆ కుక్కలో ఉండేది ఫ్రెండ్లీనెస్‌. ఇదొక క్వాలిటీ, రిలేషన్‌ కాదు. ఫ్రెండ్‌షిప్‌ వేరు, ఫ్రెండ్లీనెస్‌ వేరు. ఫ్రెండ్‌షిప్‌లో ఫ్రెండ్ ఉంటాడు. కానీ ఫ్రెండ్లీనెస్‌లో ఎవరూ ఉండరు. ఎవరో తెలియకపోయినా హ్యాపీగా ఉండొచ్చు. ఎక్కడో అడవిలో ఓ పువ్వు పూస్తుంది. దాన్ని ఎవడైనా వాసన చూసినా, చూడకపోయినా వాసన వెదజల్లుతూనే ఉంటుంది. బేసిగ్గా ఎవడికోసమో అది పూయదు. పరిమిళం వెదజల్లదు. అది దాని లక్షణం. మనం కూడా ఆ పువ్వులాగా ఉండాలి.

ఏ రిలేషన్‌ కోరుకున్నా ఎవరో ఒకరు కావాలి. కానీ ఫ్రెండ్లీనెస్‌ కోసం ఎవరూ అక్కర్లేదు. నీతో నువ్వే ఫ్రెండ్లీగా ఉండొచ్చు. నీ మీద నీకెందుకంత కోపం. ఎందుకంతా ఫ్రస్టేషన్‌. మనందరికీ మనతో మనం ఫ్రెండ్లీ ఉండటం తెలియదు. మనల్ని మనమే శిక్షించుకుంటూ ఉంటాం. మనపట్ల మన ప్రవర్తన బావుండదు. నువ్వు ఫ్రెండ్లీగా చూడాలే కానీ, నక్షత్రాలు కూడా నిన్ను నవ్వుతూ పలకరిస్తాయి. ఫ్రెండ్లీనెస్‌ అనేది సాధు లక్షణం. ఈ లక్షణం నీలో ఉంటే నువ్వు సాధువు. దీని వల్ల జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే ఇలాంటి క్వాలిటీ సాధించాలంటే మీరు ఎవరిపై ఆధారపడకూడదు. ఎవరికీ మీరు సమస్య కాకూడదు. అలా ఉన్నప్పుడే నీతో నువ్వు డాన్స్‌ చేయగలవు అన్నారు పూరీ జగన్నాథ్‌.

More News

పవర్‌స్టార్‌ సినిమా గురించి సాగర్‌ చంద్ర ఏమన్నాడంటే....!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు.

బాబాయి-అబ్బాయి హోస్టులుగా రియాలిటీ షో...

హీరోలంతా బుల్లితెర బాట పడుతున్న విషయం తెలిసిందే. అంతా హోస్టులుగా బుల్లితెరపై విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.

ప్రియురాలి చేతిలో మోసం.. కెనడాలో తెలుగు యువకుడి ఆత్మహత్య

కెనడాలో తెలుగు యువకుని ఆత్మహత్య సంచలనం రేపుతోంది. ప్రేమించిన యువతి మోసం చేసిదనే బాధతో ప్రణయ్ అనే యువకుడు నెట్రోజన్ గ్యాస్‌ను పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబంతో కలిసి ఆనందంగా దీపావళిని జరుపుకున్న రాజశేఖర్

హీరో రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుని ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.

వేణు ఊడుగుల నిర్మాణంలో తెరకెక్కుతున్న చలం ‘మైదానం’

తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమ నవలలో చలం రాసిన ‘మైదానం’ ఒకటి.