close
Choose your channels

మంత్రి పైనే తొడగొడుతున్న పూరిజగన్ తమ్ముడు!

Monday, March 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మంత్రి పైనే తొడగొడుతున్న పూరిజగన్ తమ్ముడు!

మంత్రి అయ్యన్న పాత్రుడిను టాలీవుడ్ డైరెక్డర్ పూరిజగన్నాథ్ తమ్ముడు ఉమాశంకర్ గణేష్ ఢీ కొట్టబోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఈయన ఈసారి కచ్చితంగా తన సత్తా ఏంటో చూపించి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. రెండోసారి అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు నర్సీపట్నంలో గత ఏడాది నుంచే జనాల్లో బాగా కలియతిరుగున్నారు. అయితే ఆయన సేవను గుర్తించిన వైసీపీ రెండోసారి టికెట్ ఇచ్చి గౌరవించింది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖలోని నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన ఉమాశంకర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావాలని నర్సీపట్నం నియోజకవర్గం ప్రజలందరూ కోరుకుంటున్నారు. నియోజకర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నర్సీపట్నం మున్సిపాల్టీలో టాక్స్‌లు 20 రెట్లు పెంచి ప్రజలపై పెనుభారం మోపారు.

మంత్రిగా అయ్యన్నప్రాతుడు ఉన్నప్పుటికి రూపాయి పన్ను కూడా తగ్గించలేదు. అలాగే ఆసుపత్రి పరిస్థితి దారుణం ఉంది. అత్యవసర పర్థితుల్లో వైజాగ్‌ వెళాల్సి వస్తుంది. జగన్‌ సీఎం అయిన వెంటనే ఆసుప్రతికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. నియోజకవర్గంలో ఎంతో మంది యువకులు చదువుకున్న నిరుద్యోగులుగా ఉన్నారు. జగన్ సీఎం అవ్వగానే అందరికి ఉపాధి కల్పిస్తారు. తాగునీరు సమస్యలు కూడా ఉన్నాయి" అని గణేష్ తెలిపారు.

మంత్రికి భయం పట్టుకుంది..

"నర్సిపట్నంలో అయ్యన్న పాత్రుడుకి ఓటమి భయం పట్టుకుంది. ఓటమి భయంతో చీరలు, గొడుగులు కూడా పంచుతున్నారు. ఎన్ని పంచినా ఓటు వేయరని తెలుసుకుని శివపురంలో ఆంజేయస్వామి ఆలయంలో మహిళలచే ప్రమాణాలు చేయించుకున్న దారుణమైన పరిస్థితి ఉంది. ఆ మహిళలను పిలిచి మాట్లాడితే ప్రమాణం చేయకపోతే ఇబ్బందులకు గురిచేస్తారనే భయంతోనే ప్రమాణం చేశామని తెలిపారు.

కానీ మనసులో దేవుని ఒక్కటే కోరుకున్నామని జగనన్న సీఎం కావాలని కోరుకున్నామని వారంతా నాకు చెప్పారు. నర్సీపట్నంలో ఈ ఐదు సంవత్సరాల్లో రౌడీయిజం పెరిగిపోయింది. శాంతియుత వాతావరణం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు" అని తెలిపారు. కాగా.. రెండోసారి అదృష్టాన్ని పరిశీలించుకుంటున్న ఈయన పరిస్థితి ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.